పూనమ్ కౌర్ కి సోకిన వ్యాధి ఇదీ.. లక్షణాలు ఇంత దారుణంగా ఉంటాయా, సరైన చికిత్స లేదా ?

First Published Dec 1, 2022, 5:19 PM IST

నటీమణులు వివిధ రకాల జబ్బులతో బాధపడడం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లు ఎక్కువగా డిప్రెషన్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఇటీవల సమంత ప్రమాదకరమైన మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. తాజాగా పూనమ్ కౌర్ కూడా ఓ అరుదైన వ్యాధికి గురైంది.

నటీమణులు వివిధ రకాల జబ్బులతో బాధపడడం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లు ఎక్కువగా డిప్రెషన్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఇలియానా, శృతి హాసన్ లాంటి హీరోయిన్ల గురించి ఈ రకమైన వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల సమంత అయితే ప్రమాదకరమైన మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఇది ఆటో ఇమ్యూన్ రకానికి సంబంధించిన వ్యాధి. అయితే సమంత ప్రస్తుతం కోలుకుంటోంది. 

తాజాగా పూనమ్ కౌర్ కూడా ఓ అరుదైన వ్యాధికి గురైంది. ఆమె ప్రస్తుతం ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతోంది. ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ రకమే అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి పూనమ్ కౌర్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ వ్యాధి ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుంది అని అంటున్నారు. కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి మొదలవుతుంది. దీని లక్షణాలు దారుణంగా ఉంటాయి. శరీరం మొత్తం నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి జాయింట్స్ ని, కండరాలని డ్యామేజ్ చేయదు కానీ.. నొప్పులకు కారణం అవుతుంది. 

ముఖ్యంగా నిద్రపోయి లేచిన తర్వాత శరీరం బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటాయి. నిద్ర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అసందర్భమైన నిద్రకు ఈ వ్యాధి కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి మహిళలకు సోకుతుంది. 18 ఏళ్ళు పైబడిన వారు ఈ వ్యాధికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స విధానం అంటూ లేదు. కానీ వైద్యులు వ్యక్తిని బట్టి , వారి లక్షణాలని బట్టి చికిత్స సూచిస్తారు. ఈ వ్యాధికి చికిత్స ఫార్మలాజికల్, నాన్ ఫార్మలాజికల్ విధానాలని కలిపి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారు వ్యాయామాలు చేయడం, జీవన విధానం మార్చుకోవడం చాలా ముఖ్యం. వ్యాయామాలు, జీవన విధానం మార్పే ఎక్కువ ఫలితాలని ఇస్తుంది. ఇక చికిత్స వల్ల ఫైబ్రోమయాల్జియా నొప్పు 30 శాతం వరకు తగ్గుతుందని గుర్తించారు. 

ఈ వ్యాధికి సూది చికిత్స ఆక్యుపంక్చర్ థెరపీ కూడా ఉంటుంది. అలాగే వైద్యులు ప్రత్యేకమైన డైట్ ని సూచిస్తారు. మరి కేరళలో వైద్యం తీసుకుంటున్న పూనమ్ కౌర్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 36 ఏళ్ల వయసున్నప్పటికీ పూనమ్ కౌర్ ఇంకా సింగిల్ గానే ఉంటోంది. 

click me!