సంక్రాంతి పండగ కాబట్టి బతికిపోయారు కానీ, లేదంటే చిరు, బాలయ్య పరిస్థితి వేరే ఉండేదా? .. షాకింగ్‌ డిటెయిల్స్

First Published Jan 20, 2023, 12:07 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నట సింహాం ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. హిట్లు కొట్టారు. ఇద్దరు అభిమానులు హ్యాపీ, నిర్మాతలు, కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇలా అందరూ హ్యాపీ. దీనంతటికి కారణం `సంక్రాంతి` కావడం విశేషం. 

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు సంక్రాంతి పెద్ద పండగ. సినిమాల పండగ కూడా. ఆ రోజు మూడు నాలుగు సినిమాలైనా ఆడతాయి. ఏమాత్రం బాగున్నా హిట్‌ జాబితాలోకి చేరతాయి. కలెక్షన్ల పంట పండుతుంది. ఇప్పుడు చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` చిత్రాల విషయంలో అదే జరిగింది. వీరిద్దరిని సంక్రాంతినే బతికించింది. 
 

సంక్రాంతి అనేది టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకి ఓ నమ్మకం. సినిమా మిశ్రమంగా ఉన్నా కలెక్షన్లకి ఢోకా ఉండదని, అది ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. బలమైన ఇంపాక్ట్ ని చూపించింది. సంక్రాంతికి సినిమా వస్తే అది హిట్టే అనే సందేశాన్ని ఇండస్ట్రీకి పంపింది. ఈ సంక్రాంతికి విడుదలైన `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలు నిజానికి యావరేజ్‌ మూవీస్‌. ఇంకా చెప్పాలంటే బిలో యావరేజ్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాలే. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్మురేపుతున్నాయి. అందుకు కారణం సంక్రాంతి కావడమే. 
 

పొంగల్‌ పండక్కి తెలుగు జనాలు సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. తమ పండుగలో సినిమాని భాగం చేసుకున్నారు. ఇంటిళ్లిపాది వెళ్లి సినిమా చూడటం ఆనవాయితీ, అదే మెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గానూ భావిస్తున్నారు. సినిమా ఏమాత్రం కాస్త బాగుందనిపించినా, లేదంటే టైమ్‌ పాస్‌లా ఉందనిపించినా థియేటర్‌కి వెళ్లి చూస్తారు. అందుకే బిలో యావరేజ్‌, యావరేజ్‌ రేటింగ్‌ తెచ్చుకున్న `వీరసింహారెడ్డి`, `వాల్తేర్‌ వీరయ్య` చిత్రాలకు జనం పట్టం కట్టారు. బాగా ఆదరించి కలెక్షన్ల పంట పండించారు. 
 

కంటెంట్‌ పరంగా చూస్తే రెండు సినిమాల్లో అసలు మ్యాటరే లేదు. ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, బీజీఎం మోత తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. బలమైన కంటెంట్‌ బూతద్దం పెట్టి వెతికినా దొరకదు. ఈ విషయంలో `వాల్తేర్‌ వీరయ్య`ని చూస్తే ఈ కథ చాలా ఔట్‌డేటేడ్‌ స్టోరీ. అంతేకాదు లాజిక్‌ లెస్‌ స్టోరీ కూడా. చిరంజీవితో కలిసి అన్న ప్రకాష్‌ రాజ్‌ వ్యాపారం చేస్తుండగా, అసలు వీరయ్య ఎవరో తెలియనట్టుగా తమ్ముడుగా చేసిన బాబీ సింహా యాక్ట్ చేయడం పెద్ద లాజిక్‌ లెస్‌, అంతేకాదు వీరయ్య అంటే అందరికి హడల్‌ ఎందుకో ఒక్క సీన్‌ కూడా చూపించకపోవడం గమనార్హం. పైగా విలన్లని చంపేందుకు ఓ మరో గ్యాంగ్‌ స్టర్‌ లాంటి వీరయ్యకి పోలీస్‌ ఆఫీసర్‌ అయిన రాజేంద్రప్రసాద్‌ 25 లక్షలు ఇవ్వడం మరీ బ్లండర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో చాలా లాజిక్‌ కి అందని మిస్టేక్స్ ఉన్నాయి. 

కానీ చిరంజీవి వింటేజ్‌ లుక్‌, ఆయన కామెడీ, భారీ యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు, పాటలు ఈ సినిమాని బతికించాయి. పైగా సంక్రాంతి సీజన్‌ కావడంతోనే జనం ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిపారు. ఇదే సినిమా ఇతర సందర్భంలో, పండుగ సీజన్‌ కాకుండా వస్తే, మూడు రోజుల్లోనే క్లోజ్‌ అయిపోయేదని ట్రేడ్‌ వర్గాల టాక్‌. ఓ రకంగా సంక్రాంతి చిరుకి కమ్‌ బ్యాక్‌ని, పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `సైరా` నుంచి సక్సెస్‌ లేని చిరుకి సక్సెస్‌ని ఇచ్చిన, కలెక్షన్ల పరంగా మెగా హీరోల్లో నెంబర్‌ 1గా ఉంచింది. ఈసినిమా సుమారు 150కోట్ల గ్రాస్‌, వంద కోట్ల షేర్‌ సాధించి లాభాల్లో సాగుతుంది.
 

మరోవైపు బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` సినిమాలో ఎలివేషన్లు, ఫైట్లు, పాటలు తప్ప ఇంకేమీ లేదు. ఓ సెంటిమెంట్‌ వర్కౌట్‌ కాలేదు, ప్రియుడి చనిపోయినందుకు అన్నపై వరలక్ష్మి ప్రతీకారం తీర్చుకునేందుకు విలన్లతో కలవడం పెద్ద లాజిక్‌ లెస్‌. ఇంకా చెప్పాలంటే ఇందులో అసలు కథే లేదని, ఎన్నో బాలకృష్ణ సినిమాలను తిరగేసి తీసినట్టుగానే ఉంటుందనే విమర్శ ప్రారంభం నుంచే వచ్చింది. బాలకృష్ణ ఫైట్లు తప్ప ఇంకేం చేయలేడా? అనేట్టుగా ఈ సినిమా ఉందనే టాక్ వచ్చింది. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్‌లో నాలుగు, సెకండాఫ్‌లో నాలుగు, ప్రతి పది నిమిషాలకు ఓ ఫైట్‌, ఒక్కోటి పది నిమిషాలు ఉంటుంది.
 

విలన్‌ ప్రతిసారి హీరోని చంపేందుకు వస్తాడు, వెనుతిరిగిపోతాడు. ఇది ప్రతి ఫైట్‌లోనూ ఇదే జరుగుతుంది. అంతేకాదు డైలాగులు కూడా సేమ్‌. రారా.. నా చేతుల్లోనే నీ చావు, అది రిపీట్‌గా కొట్టారు. విలన్‌కి అంతకు మించిన డైలాగ్‌ చెప్పడం రాదా అనేట్టుగా మార్చేశారు. తండ్రిని చంపినందుకు హీరోపై పగ తీర్చుకోవాలనుకుంటాడు విలన్‌. ప్రతి సారి అదే చేస్తాడు. చివరికి హీరోని(పెద్ద బాలకృష్ణ)ని చంపేస్తారు. ఆ తర్వాత పగేంటి? మళ్లీ ఎందుకు అతన్ని చంపాలనుకుంటాడనేది లాజిక్‌ కి అందని లూప్‌. ఆడవాళ్లని గౌరవించే బాలకృష్ణ, ఊరి పెద్దగా ఉన్న బాలయ్య పెళ్లికాకుండానే ప్రియురాలిని తల్లిని చేయడమేంటి? ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని లూప్స్ కి అంతేలేదు. 

Veerasimhareddy Review

మ్యాజిక్‌ జరిగితే లాజిక్‌లు పక్కకెళ్లి ఆడుకోవాల్సిందే అన్నట్టుగా సంక్రాంతి సీజన్‌, జనం సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కారణంగా ఈ సినిమా, బాలయ్య బతికిపోయారు కానీ, ఇదే సినిమా నాన్‌ ఫెస్టివల్‌ సీజన్‌లో వస్తే డిజాస్టర్‌గా నిలిచేదనే విమర్శ క్రిటిక్స్ నుంచి, అటు ఆడియెన్స్ నుంచి వచ్చింది. అతి హింస ఈ సినిమా పెద్ద మైనస్‌. కానీ `అఖండ` సక్సెస్‌ జోరు, సంక్రాంతి ఈ చిత్రాన్ని విజయ తీరానికి చేర్చింది. ఈ సినిమా మొత్తంగా 120కోట్ల గ్రాస్‌, 75కోట్ల షేర్‌ దక్కించుకుని బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఇకపై లాభాల్లో రన్‌ కాబోతుంది. 

click me!