చాలా సంవత్సరాలుగా జనాలు మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. దాని గురించి మాట్లాడుకోవడం కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు, ఇది సమాజంలో ఎక్కువగా చర్చించే విషయాలలో ఒకటిగా మారింది. బాలీవుడ్ హీరోయిన్ల వల్ల ఇది సాధ్యం అయ్యింది. తాము అనుభవించిన ఇబ్బందుల గురించి నిజాయితీగా చెప్పడం ద్వారా అందరు వీటి గురించి మాట్లాడుకోవడానికి ప్రేరణ అయ్యింది.
ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత పేరు, డబ్బు ఉన్నా ఎవరికైనా మానసిక సమస్యలు రావచ్చ అనే విషయం అందరికి అర్ధం అయ్యింది. భారతదేశంలో మానసిక ఆరోగ్యం గురించి ధైర్యం చేసి మాట్లాడిన హీరోయిన్ దీపికా పదుకొణె . ఆమె 2014లో తనకు డిప్రెషన్ ఉందని మొదటిసారిగా చెప్పింది.
Also Read: పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?
ఇటీవల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో తన ప్రయాణం గురించి చెప్పింది.స్కూల్ నుండి స్పోర్ట్స్, ఆ తర్వాత మోడలింగ్, చివరకు నటనకు మారేటప్పుడు తన మానసిక ఆరోగ్యం ఎలా దెబ్బతిందో గుర్తు చేసుకుంది. 2014లో, ఆమె అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయింది, అప్పుడే తనకు డిప్రెషన్ ఉందని తెలిసింది.
"డిప్రెషన్ అనేది ఎప్పుడూ కనిపించదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఆందోళన లేదా డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళు సంతోషంగా, సాధారణంగా కనిపిస్తారు కాబట్టి మనకు తెలియకపోవచ్చు" అని ఆమె చెప్పింది.తన తల్లి గుర్తించడం వల్లే తాను సహాయం తీసుకోగలిగానని దీపికా చెప్పింది.
Also Read: నాటుకోడితో ఇడ్లీలు, తోటకూర వెల్లుల్లి కారం, యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవో తెలుసా?
"మా అమ్మ ముంబై వచ్చినప్పుడు, ఏదో తేడాగా ఉందని గమనించింది. బెంగళూరు వెళ్ళే రోజు, నేను ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెట్టాను. మా వాళ్ళు పని గురించి అడిగారు, కానీ ‘నాకు తెలీదు. ఏదో కోల్పోయినట్టు, నిస్సహాయంగా ఉంది. బతకాలని లేదు’ అని చెప్పాను. అప్పుడు మా అమ్మ వెంటనే సైకాలజిస్ట్‌ను కలవమని చెప్పింది."
అప్పటి నుండి, దీపికా మానసిక ఆరోగ్యం గురించి అందరికీ అవగాహన కల్పించడానికి చాలా కృషి చేస్తోంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయడానికి లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌ను ప్రారంభించింది.
Also Read: పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్
ప్రముఖ సంగీత కళాకారుడు యో యో హనీ సింగ్ కూడా తనకు బైపోలార్ డిజార్డర్, సైకోటిక్ లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. తన డాక్యుమెంటరీ ఫేమస్‌లో, తన మానసిక ఆరోగ్యం ఎలా క్షీణించిందో, అది తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించాడు.
ఆయన మాట్లాడుతూ "నా మెదడు ఎక్కువగా పనిచేసి అదుపు తప్పుతుంది. కలలో జరిగేవి నిజ జీవితంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నిజానికి, భ్రమకి తేడా తెలియదు. పని మనిషి కూడా నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించేది. నేల మీద రక్తం కనిపించేది, కానీ అక్కడ ఏమీ ఉండేది కాదు. ఎక్కడో చిక్కుకుపోయినట్టు అనిపించేది."
Also Read: 100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార - విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?
అత్యంత బాధాకరమైన విషయాల గురించి చెబుతూ, "చాలామంది నరకం చూశామని చెబుతారు. కానీ నేను నిజంగానే నరకం చూశాను. చావుని చూశాను, ప్రతిరోజు దాని కోసం ఎదురు చూశాను. పడుకునేవాడిని, ఏడ్చేవాడిని, ఎవరినీ కలిసేవాడిని కాదు. గంటల తరబడి చంద్రుడిని చూస్తూ ఉండేవాడిని, కానీ అది కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండేది. రోజులు ఎప్పటికీ అయిపోనట్టు అనిపించేది.
ఎవరో చనిపోతారని, బహుశా నేనే చనిపోతానని అనుకునేవాడిని. అని అన్నారు. ఇక అతను తన సమస్యల గురించి చెప్పడం ద్వారా, మానసిక రోగాల గురించి చాలామందికి తెలిసింది, ముఖ్యంగా సెలబ్రిటీలు ఎలా బాధపడతారో అర్థమైంది.
singer Harrdy Sandhu open up he face sexual harrasment
బిజ్లీ బిజ్లీ పాటతో పాపులర్ అయిన సింగర్ హార్డీ సంధు, క్రికెటర్ అవ్వాలనే తన కల గాయం కారణంగా ఆగిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. ఆయన తన అనుభవాలు వెల్లడించారు. హార్డీ మాట్లాడుతూ "క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ కెరీర్ కోల్పోవడం వల్ల నేను చాలా బాధపడ్డాను.
కానీ సంగీతంలో నాకు ఓదార్పు దొరికింది. రోజుకి 18 గంటలు భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. 2011లో నా మొదటి ఆల్బమ్ ‘దిస్ ఈజ్ హార్డీ సంధు’ విడుదల చేశాను, ఆ తర్వాత 2013లో ‘సోచ్’ విడుదల చేశాను. తర్వాత అంతా చరిత్రే. అని ఆయన అన్నారు. ఇక తన కథ ద్వారా, కష్టపడి పనిచేస్తే మానసిక సమస్యల నుండి బయటపడవచ్చని సింగర్ హార్డీ సంధు నిరూపించా
స్టార్ హీరోయిన్ అలియా భట్ సోదరి షహీన్ భట్ తన టీనేజ్ నుండి డిప్రెషన్‌తో పోరాడుతోంది. తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, సహాయం తీసుకోవాలని ఇతరులను ప్రోత్సహిస్తోంది. షహీన్ భట్ తనకు 13 సంవత్సరాల వయస్సు నుండి డిప్రెషన్ ఉందని చెప్పింది.
ఇందులో సీక్రేట్ ఏమీ లేదు.. ఈ విషయం అందరికి తెలుసు అంటోంది ఆమె. ఇక తన డిఫ్రెషన్ కు సబంధించి ఆమె మాట్లాడుతూ.. "నేను చిన్నప్పటి నుండి డిప్రెషన్‌తోనే జీవిస్తున్నాను. దాని గురించి నేను ఎప్పుడూ సిగ్గుపడను , ఈ విషయాలను దాచుకోవాలి అని కూడా అనుకోను. ఇ్పుడు అది నాలో ఒక భాగం" అని ఆమె చెప్పింది.
తన డిప్రెషన్ లక్షణాలు కూడా వివరించారు షహీన్ భట్. "ఒక్క క్షణం అన్నీ సాధారణంగా ఉంటాయి, ఆ తర్వాత నా మెదడులో లైట్ ఆరిపోయినట్టు ఉంటుంది. నేను ఎవరితో మాట్లాడకుండా, మంచం దిగడానికి కూడా కష్టపడతాను. నా చుట్టూ ఉన్న ప్రపంచం మసకగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని గంటలు, కొన్నిసార్లు కొన్ని రోజులు ఇలానే ఉంటుంది.
"ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, షహీన్ తన అనుభవాలను పంచుకుంటూ మానసిక ఆరోగ్యం గురించి చర్చలు మొదలుపెట్టింది. చాలామందికి సహాయం చేయడానికి, డిప్రెషన్ గురించి ఉన్న అపోహలను తొలగించడానికి ఆమె స్ఫూర్తినిచ్చింది.
ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలు తమ మానసిక సమస్యల గురించి మాట్లాడటం ఒక పెద్ద మార్పు. వాళ్ళ కథలు, ఎంత సక్సెస్ ఉన్నా ఎవరికైనా మానసిక సమస్యలు రావచ్చని గుర్తు చేస్తాయి. వాళ్ళ అనుభవాలను పంచుకోవడం ద్వారా, చాలామంది సహాయం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల సమాజం కూడా అర్థం చేసుకుని, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది.