పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు తరువాత వారి పిల్లలు ఇద్దరు పూణేలో పెరిగారు. రేణు దేశాయ్ వారిని పెంచారు. మరి అక్కడ పెరిగిన వీరిద్దరు ఏ భాష మాట్లాడుతారు? ఇద్దరికి తెలుగు వస్తుందా? అసలు పవన్ తో వారిద్దరు ఏ భాషలో మాట్లాడుతారు? 

Pawan Kalyan

పవర్ స్టార్ కూడా అప్పుడప్పుడు పూణే వెళ్లి పిల్లల్ని చూసి వచ్చేవారు. అంతే కాదు వారిద్దరితో రెగ్యులర్ టచ్ లో కూడా ఉండేవారట. అయితే పిల్లలతో పవన్ కళ్యాణ్ ఏ భాషలో మాట్లాడుతారు. తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ లేక హిందీ ఇందులో వారు ఏ భాషలో మాట్లాడుతారు అంటే.. ఈ విషయంలో గతంలో క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్.  పవన్ కళ్యాణ్ ను కంట్రోల్ చేయాలి అంటే ఆద్యకు మాత్రమే సాధ్యం అవుతుందట. 

Also Read: నాటుకోడితో ఇడ్లీలు, తోటకూర వెల్లుల్లి కారం, యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవో తెలుసా?

aadya

పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ విడాకులు తీసుకునే టైమ్ కు పిలల్లు ఇద్దరు చాలా చిన్నవాళ్లు. దాంతో వారిని రేణు దేశాయ్ తనతో తీసుకెళ్లి పెంచారు. దాంతో అకీరా, ఆద్యలు ఇద్దరు రేణు సొంత ప్రాంత అయిన పూణేలోనే పెరిగారు. వారు పుణేలో పెరిగినా కూడా తండ్రితో అనుబంధం మాత్రం తగ్గలేదు. విడాకులు తీసుకుని విడిపోయినా కాని.. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్  పిల్లల కోసం స్నేహితులుగానే ఉన్నారు. 

Also Read: పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్


చిన్న తనం నుంచి తన తండ్రిని డిమాండ్ చేయడం తనకు అలవాటు అయ్యిందట. ఆద్య వద్దు అంటే పవన్ కూడా దానికి కట్టుబడి ఉంటాడట. ఫోన్ చేసి ఫలానా డేట్ కు రావాల్సిందే అంటే.. పవన్ ఆ టైమ్ కు ఫ్రీ అయ్యేలా చూసుకుని పుణే వెళ్లేవారట. ఇక ఆద్యతో పవర్ స్టార మరాఠాలో మాట్లాడతారట. తన కూతురి కోసం మరాఠ నేర్చుకున్నారట పవన్. ఇక అకీరా తెలుగు చాలా బాగా మాట్లాడతారట. తండ్రితో అకీరా ఎక్కువగా స్పిరుచ్యువల్ టాపిక్స్ ను డిస్కర్స్ చేస్తారట. 

Also Read:ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?

సినిమాల గురించి వీరు అస్సలు మాట్లాడుకోరని తెలిపారు రేణు. ఇలా పవన్ కళ్యాణ్ తో వారి ఇద్దరు పిల్లలు తెలుగు, మరాఠి భాషలో మాట్లాడతారట. ఇక ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. పెండింగ్ లో ఉన్న మూడు సినిమాలు కంప్లీట్ చేయడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా ఏపీలో పవన్ బిజీ అవ్వడంతో.. అకీరాను రంగంలోకి దింపాలి అనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. 

Also Read: 25 రోజులైనా తగ్గని డ్రాగన్ క్రేజ్, బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోన్న ప్రదీప్ రంగనాథన్ సినిమా

ఇప్పటికే అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం రెడీ అవుతునర్నట్టు సమాచారం. యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు మార్షల్ ఆర్ట్స్ , డాన్స్, కర్రసాము ఇలా అన్నింట ట్రైనింగ్ అవుతున్నాడట అకీరా. పవన్ కూడా అకీరాను తన వెంట తిప్పుతూ.. అన్నీ నేర్పిస్తున్నారు. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. అకీరాను లాంచ్ చేసే డైరెక్టర్ ఎవరా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు.  మరి అకీరా నందన్ మెగా ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది ఏంటో చూడాలి.  

Also Read: 100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార ‌- విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?

Latest Videos

click me!