25 రోజులైనా తగ్గని డ్రాగన్ క్రేజ్, బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోన్న ప్రదీప్ రంగనాథన్ సినిమా

Published : Mar 16, 2025, 05:45 PM IST

Dragon Movie Box Office Collection Report:  సీనియర్ స్టార్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో  ప్రదీప్ రంగనాథన్, అనుపమ, కయాదు లోహర్ నటించిన డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు రాబడుతుంది. 25రోజులు అయినా జోరు తగ్గలేదు సినిమాకు. 

PREV
14
25 రోజులైనా తగ్గని డ్రాగన్  క్రేజ్,  బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోన్న  ప్రదీప్ రంగనాథన్ సినిమా

Dragon 25 days box office collections : ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రెండో సినిమా డ్రాగన్. అతని మొదటి సినిమా లవ్ టుడే భారీ విజయం సాధించడంతో పాటు బాక్సాఫీస్‌లో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమాను నిర్మించిన ఏజీఎస్ సంస్థే డ్రాగన్ సినిమాను కూడా నిర్మించింది. డ్రాగన్ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటుడు ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు.

Also Read: నాటుకోడితో ఇడ్లీలు, తోటకూర వెల్లుల్లి కారం, యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవో తెలుసా?

24
డ్రాగన్

డ్రాగన్ సినిమా యూత్‌ను ఆకట్టుకునేలా ప్రేమ, కామెడీ, రొమాన్స్ సీన్స్‌తో రూపొందించారు. డ్రాగన్ సినిమాలో గౌతమ్ మీనన్, మిస్కిన్, జార్జ్ , హర్షద్ ఖాన్, విజయ్ సిద్దు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈసినిమా తమిళంలో పాటు తెలుగు ఆడియన్స్ ను కూడా అలరించింది. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: చందాలు వసూలు చేసి కూతురు పెళ్లి చేశా, కన్నీరు పెట్టించిన జబర్దస్త్ రైజింగ్ రాజు కామెంట్స్

34
డ్రాగన్ మూవీ కలెక్షన్

ధనుష్ దర్శకత్వం వహించిన నీక్ సినిమాను బాక్సాఫీస్‌లో ఓడించిన డ్రాగన్ సినిమా, ఆ తర్వాత వారాల్లో విడుదలైన జీవి ప్రకాష్ కింగ్‌స్టన్ సినిమాలను కూడా దెబ్బకొట్టింది. విజయవంతంగా ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతోంది. 

Also Read: ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?

44
డ్రాగన్ మూవీ బాక్సాఫీస్

కేవలం 37 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డ్రాగన్ సినిమా బాక్సాఫీస్‌లో 25 రోజులు దాటినా వసూళ్ల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.145 కోట్లు వసూలు చేసింది. తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు షాక్ ఇస్తూ దూసుకుపోతోంది డ్రాగన్ సినిమా. 

Also Read: పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్

Read more Photos on
click me!

Recommended Stories