1500 ఫస్ట్ జీతం.. ప్రస్తుతం 15 కోట్లు వసూలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

First Published Jun 19, 2024, 11:36 AM IST

ప్రస్తుతం స్టార్ గా వెలుగు వెలుగుతున్న ఓ హీరోయిన్.. ఒకప్పుడు 15 00 జీతానికి పనిచేసిందని మీకు తెలుసా..? ఇప్పుడు ఒక్క సినిమాకు కోట్లకు కోట్లు వసూలు చేస్తున్న సీనియర్ బ్యూటీ.. అప్పుడు ఉన్న కొద్ది డబ్బులతోనే లైఫ్  ను లీడ్ చేసేదని తెలుసా..? ఇంతకీ ఎవరా హీరోయిన్. 

బాలీవుడ్ తో పాటు.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపింది. మోడల్ గా..మిస్ ఇండియాగా.. మిస్ వరల్డ్ గా.. ఎన్నో సాధించింది. వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోయింది. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న సీనియర్ బ్యూటీ.. ఇప్పుటికీ కోట్లకు కోట్లు సంపాదిస్తోంది. కాని ఒకప్పుడు ఆమె శాలరీ 1500 అని మీకు తెలుసా..? 

రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?
 

ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు.. సల్మాన్ ఖాన్ ..షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్ రజినీకాంత్, ఇలా స్టార్స్ అందరితో కలిసి నటించి మెప్పించిన తార ఐశ్వర్యా రాయ్. ఆమె ఒకప్పుడు ఇండియన్ సినిమాకు దేవతగా కొలువబడింది. ఆమె కళ్ళకు కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో నటన, అందం లిస్ట్ లో టాప్ లో ఉన్న హీరోయిన్లలో ఐశ్వర్య ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఐశ్వర్యరాయ్ కి మొదటి నుంచి ఈ జీవితం లేదు. ఆమె ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. 

సినిమాల్లోకి రోజా రీ ఎంట్రీ..? జబర్థస్త్ కూడా కష్టమే.. కోలీవుడ్ కు వెళ్ళిపోయిందా..?

ఫిల్మ్ ఇండస్ట్రీఅంటే అంతే.. రజినీకాంత్, చిరంజీవి, షారుఖ్ ఖాన్, ఇలా అంతా కింద స్థాయి నుంచి పైకి వచ్చినవారు. మొదట్లోఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎదిగినవారే.   అలాగే చాలా మంది హీరోయిన్స్ సైతం ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి..అనేక కష్టాలను ఎదుర్కొని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అందులో ఐశ్వర్య రాయ్ కూడా ఉంది. ఐశ్వర్య రాయ్ కూడా కెరీర్ బిగినింగ్ లో జాబ్ చేసిందట. ఆమె మొదటి జీతం రూ.1500 తీసుకుందట. 

రజినీకాంత్ - కమల్ లకు కూతురిగా, హీరోయిన్ గా నటించిన బ్యూటీ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు
 

 ప్రస్తుతం ఒక్కొ సినిమాకు 12 నుంచి 15 కోట్లు వసూలు చేస్తుంది ఐశ్వర్య. మోడిలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఒకప్పుడు ఆమె ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది. అప్పట్లో కుర్రాళ్ల ఆరాధ్య దేవత. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లుగా గట్టిపోటీనిస్తుంది. ఇంతకీ ఆ తార ఎవరా అనుకుంటున్నారా.. ? తనే ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. నటికాకముందు ఆమె మోడల్ అని అందరికి తెలిసిందే.

4 కోట్ల బంగ్లా, ఖరీదైన కార్లు.. కెజియఫ్ స్టార్ యష్ మొత్తం ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

1992లో మోడల్ గా ఆమె జీతం 1500 ఆతరువాత అంచలంచులుగా ఎదిగి 1994లో మిస్ వరల్డ్‌ గా మారింది. విజేతగా  భారతదేశానికి గర్వకారణం అయ్యింది. ఆతరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. మొదటిగా  మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది ఔర్ ప్యార్ హో గయా సినిమాతో హిందీ మూవీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అందాల పోటీల్లో పాల్గొనే ముందు తనకు సినిమాల్లో నటించడానికి నాలుగు ఆఫర్లు వచ్చాయని ఐశ్వర్యరాయ్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి  సినిమాలను కూడా త్యాగం చేసింది ఐశ్వర్య.  ఇక హిందీలో వరుసగా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ లతో వరుస సినిమాలు చేసి.. హిట్లు మీద హిట్లు కొట్టింది ఐశ్వర్యారాయ్. ఆతరువాత బచ్చన్ వారి ఇంటి కోడలుగా అడుగు పెట్టి.. సినిమాలు తగ్గించింది. అభిశేక్ తో పెళ్ళి.. ఆరాధ్య పుట్టడం.. కుటుంబ బాధ్యతలు ఉన్నా.. ఆతరువాత మళ్ళీ నటించడం స్టార్ట్ చేసింది ఐశ్వర్య. 
 

ఆమెకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చిన మణిరత్నం  అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో ఐశ్వర్య నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో సౌత్ ఇండస్ట్రీలోనూ ఆమెకు మచి క్రేజ్ వచ్చింది. శంకర్ డైరెక్షన్ లో రెండు సినిమాలు కూడా ఐశ్వర్య రేంజ్ ను పెంచేశాయి. ఇక ఇప్పటికీ తమిళంలో నటించడానిక అందులోనూ మణిరత్నం సినిమాల్లో నటించడానికి హుషారుగా ఒకే చేస్తుంది ఐశ్వర్య రాయ్. కాని ఎందుకో తెలుగులో మాత్రం ఆమె ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. 
 

రీసెంట్ గా మణిరత్నం డైరెక్ట్ చేసిన పొన్నియన్ సెల్వన్ లో అద్భుత నటన కనబరిచిన ఐశ్వర్యరాయ్.. ఒక్క సినిమాకు 12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.  ఇక ఆమెకు ముంబైలో 21 కోట్ల విలువైన ఇంటితో పాటు.. 1000  కోట్లకు పైగా  ఆస్తిని ఉన్నట్టుటాక్.  బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. వీరికి పాప ఆరాధ్య జన్మించింది.

Latest Videos

click me!