బిగ్ బాస్ షో వలన నాకు, నా భార్యకు జరిగింది అదే... హీరో వరుణ్ సందేశ్ కీలక కామెంట్స్!

First Published Jun 19, 2024, 8:37 AM IST


వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు తో పాటు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నాడు. తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న మొట్టమొదటి కపుల్ వీరు. కాగా బిగ్ బాస్ షో  వలన తనకు ఒరిగింది ఇదే అంటూ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. 
 

వస్తూనే సంచలనాలు చేసిన హీరోల్లో వరుణ్ సందేశ్ ఒకరు. ఆయన డెబ్యూ మూవీ హ్యాపీ డేస్ బ్లాక్ బస్టర్. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. రెండో చిత్రం కొత్త బంగారు లోకం మరో సంచలనం. యూత్ లో వరుణ్ సందేశ్ కి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చి పడింది. 
 


వరుణ్ తేజ్ ఆ సక్సెస్ ట్రాక్ కొనసాగించడంలో ఫెయిల్ అయ్యాడు. వరుస పరాజయాలతో ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా త్వరగా పడిపోయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. 2019లో ప్రసారమైన సీజన్ 3లో భార్య వితిక షేరుతో పాటు వరుణ్ సందేశ్ పార్టిసిపేట్ చేశాడు. తెలుగు బిగ్ బాస్ షోలో జంటగా పాల్గొన్న మొదటి భార్యాభర్తలు వరుణ్-వితిక. 

Varun Sandesh

హౌస్లో వీరి గిల్లికజ్జాలు ఎంటర్టైన్ చేసేవి. వితిక ఇతరుల మీద ఫిర్యాదు చేస్తూ ఉండేది. వరుణ్ మాత్రం చాలా కూల్ గా రెస్పాండ్ అయ్యేవాడు. వితిక 13వ వారం ఎలిమినేట్ కాగా... ఫైనల్ కి వెళ్లిన వరుణ్, 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజాగా బిగ్ బాస్ హౌస్లో పాల్గొనడం పై వరుణ్ సందేశ్ స్పందించాడు. ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 
 

Varun Sandesh

బిగ్ బాస్ హౌస్ కి రావడానికి ముందు నా చేతిలో సినిమాలు లేవు. రెండేళ్లు ఖాళీగా ఉన్నాను. నా దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో వాళ్ళను అడిగేవాడిని కాదు. బిగ్ బాస్ షో వలన నాకు, వితికకు డబ్బులు బాగానే వచ్చాయి. బిగ్ బాస్ షో కారణంగా ఆర్థికంగా కలిసి వచ్చింది. ఆర్థిక కష్టాలు తీరాయి. 
 

Varun Sandesh

బిగ్ బాస్ షోతో నా వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసొచ్చాయి. అంతకు ముందు నా గురించి ఏవేవో అనుకునేవారు. బిగ్ బాస్ షోలో నన్ను చూశాక అందరూ ప్రేమించారని చెప్పుకొచ్చాడు. వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ నింద జూన్ 21న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో వరుణ్ పాల్గొంటున్నారు. ఈసారి ఆయన సీరియస్ రోల్ ట్రై చేశారు. 

Latest Videos

click me!