సోగ్గాడు శోభన్ బాబు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. తీవ్రమైన పోటీలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి అగ్ర నటుల జాబితాలో శోభన్ బాబు చేరారు. శోభన్ బాబు వ్యక్తిత్వం గురించి, జీవితంలో ఆయన పర్తించే విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శోభన్ బాబు అందగాడు మాత్రమే కాదు.. మంచి మనసున్న వ్యక్తి కావడంతో అప్పట్లో హీరోయిన్లకి ఆయనంటే ఇష్టం ఉండేది.