Bimbisara: కళ్యాణ్‌ రామ్‌ `బింబిసార` మూవీ రివ్యూ

Published : Aug 05, 2022, 01:37 PM ISTUpdated : Aug 05, 2022, 08:39 PM IST

ఫాంటసీ, టైమ్‌ ట్రావెల్‌ మేళవిస్తూ కళ్యాణ్‌ రామ్‌ చేసిన ప్రయోగం `బింబిసార`. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం(ఆగస్ట్ 5)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
18
Bimbisara: కళ్యాణ్‌ రామ్‌ `బింబిసార` మూవీ రివ్యూ

ఫాంటసీ చిత్రాలకు, టైమ్‌ ట్రావెల్‌ మూవీస్‌కి ఆడియెన్స్ లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. బలమైన కథతో మ్యాజికల్‌గా రూపొందిస్తే బాక్సాఫీసు వద్ద వండర్స్ క్రియేట్‌ చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ తెలుగులో ఫాంటసీ, టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. ఇటీవల కాలంలో రాలేదనే చెప్పాలి. ఫాంటసీతో `ఆదిత్య 369`, టైమ్‌ ట్రావెల్‌తో `24` వంటి చిత్రాలొచ్చాయి. చాలా రోజుల తర్వాత `బింబిసార`తో ఓ ప్రయోగం చేశాడు హీరో కళ్యాణ్‌ రామ్‌. వరుస పరాజయాల్లో ఉన్న ఆయన తన పంథాని మార్చి చేసిన చిత్రమిది. దీనికి డెబ్యూ డైరెక్టర్‌ వశిష్ట దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్‌, కేథరిన్‌ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కే నిర్మించిన `బింబిసార` ఆగస్ట్ 5న థియేటర్లో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది, కళ్యాణ్‌ రామ్‌ కమ్‌బ్యాక్‌నిచ్చే చిత్రంగా నిలిచిందా? లేక నిరాశ పరిచిందా? అనేది `ఏసియానెట్‌` రివ్యూ(Bimbisara Review)లో తెలుసుకుందాం. 

28

కథః 
ఐదవ శతాబ్దంలో త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు(కళ్యాణ్‌రామ్‌) అతి క్రూరమైన రాజు. తనకు ఎదురే లేదని, తనని ఎదిరించే వారు ఇంకా పుట్టలేదని, తన రాజ్యంలో ప్రజలకు తనే రాజుని అని, తనే రాక్షసుడని విర్రవీగుతుంటాడు. రాజ్య విస్తరణే లక్ష్యంగా పక్క రాజ్యాలపై యుద్ధం చేస్తూ ఆక్రమించుకుంటాడు. అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని అంతం చేస్తుంటాడు. తన అధికారానికి అడ్డొస్తాడనే ఉద్దేశంతో సొంత తమ్ముడు దేవదత్తుడు(కళ్యాణ్‌ రామ్‌)నే చంపేస్తాడు. తనకు ఎదురు తిరిగిన పక్క రాజ్యం రాజుని చంపేసి ఆయన కూతురు యువరాణి ఐరా(కేథరిన్‌)ని తన వద్ద ఉంచుకుంటాడు. మరోవైపు తన శత్రువు ప్రాణాలు కాపాడారని ఆయుర్వేదానికి నెలవైన గూడెంపై దాడి చేసి తగలబెట్టేస్తాడు. అక్కడ తనని శపించిన గురువుని, ఓ చిన్నారిని చంపేస్తాడు. కానీ ఓ మాయాదర్పణం కారణంగా బింబిసారుడు ఊహించని రీతిలో 21వ శతాబ్దంలో వచ్చిపడతాడు. మరి నేటి కాలానికి వచ్చాక బింబిసారుడిలో వచ్చిన మార్పేంటి? త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఆ తర్వాత ఎవరు పాలించారు? చనిపోయిన తమ్ముడు ఎలా బతికాడు, తాను చంపేసిన పాప తన ప్రాణాలను ఎలా కాపాడింది? ఆయుర్వేద గురువు తనని ఏమని శపించాడు? తనలో మార్పుకి కారణమేంటి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.  

38

విశ్లేషణః
అధికారం, బలం ఉందనే అహం మనిషిని ఎలా అంతం చేస్తుందనేది, అది తరతరాలను ఎలా వెంటాడుతుందనేది, అహం వీడటమే అసలైన విజయమని చెప్పిన చిత్రమిది. అయితే చరిత్ర, ప్రస్తుతాన్ని మేళవిస్తూ దానికి టైమ్‌ ట్రావెల్‌ని అనే కాన్సెప్ట్ ని తీసుకుని `బింబిసార` చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంచుకున్న బ్యాక్‌ డ్రాప్‌ కొత్తగా ఉంది తప్పితే, కథలో కొత్తదనం లేదు. కానీ త్రిగర్తల రాజ్యం కాలానికి, నేటి కాలానికి ముడిపెడుతూ పారలల్‌గా రెండింటిని నడిపించి తీరు ఆకట్టుకుంటుంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో ఓ కొత్త తరమైన స్క్రీన్ ప్లేగా చెప్పొచ్చు. ఈ విషయంలో చాలా కన్విన్సింగ్‌గా సినిమాని నడిపించారు దర్శకుడు వశిష్ట. ఫాంటసీ అంశాలు అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఆడియెన్స్ కి కనెక్టింగ్‌ పాయింట్‌. 

48

అదే సమయంలో సినిమా మొత్తాన్ని పాత కాలంలోనే కాకుండా, నేటి రోజులకు ముడిపెట్టి వినోదాత్మకంగా తీయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. కానీ కథే రొటీన్‌గా అనిపించింది. మొదటి భాగంలో కథ రసవత్తరంగా సాగుతుంది. రెండో భాగంలో కన్‌ఫ్యూజన్‌ ఎక్కువైంది. దీంతో రొటీన్‌గా మారి బోరింగ్‌ని తెప్పిస్తుంది. చివరికి క్లైమాక్స్ కూడా రొటీన్‌ గానే ముగించారు. దీనికితోడు సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ తప్ప మరే పాత్ర బలంగా లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్‌గా చెప్పొచ్చు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, పాటలు ప్లస్‌గా నిలిచాయి. దీనికితోడు రాజు పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఆహార్యంలో విషయంలో కాస్త తేలిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది.ఆయన ద్విపాత్రాభినయం ఫ్యాన్స్ కి సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. యాక్షన్‌ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  

58

ఫాంటసీ చిత్రం కావడంతో చాలా ఎలిమెంట్స్ విషయంలో లాజిక్‌ మిస్‌ అయ్యారు. బలమైన విలన్‌ లేకపోవడం కూడా సినిమాకి పెద్ద మైనస్‌. హీరోయిన్ల పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ఈ విషయాల్లో మరికాస్త కేరింగ్‌ తీసుకుంటే సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండొచ్చు. ఓవరాల్‌గా ఈ టైమ్‌లో థియేటర్లో చూసి కాసేపు ఎంజాయ్‌ చేసే చిత్రంగా నిలుస్తుందని చెప్పొచ్చు. 

68

ఆర్టిస్టులుః
బింబిసార పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ విశ్వరూపం చూపించారు. రాజుగా, నేటి కాలంలో మామూలు వ్యక్తిగా మౌల్డ్ అయ్యే సమయంలో ఆయనలోని నటుడు బయటకొచ్చాడని చెప్పొచ్చు. కళ్లతోనే హవభావాలను, క్రూరత్వాన్ని పలికించారు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ తన కెరీర్‌లోనే బెస్ట్ ఇచ్చాడు. ఇక హీరోయిన్లు సంయుక్త మీనన్‌, కేథరిన్‌ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సంయుక్త మీనన్‌ పాత్రని బలవంతంగా ఇరికించినట్టుగా ఉంటుంది. వీరితోపాటు విలన్‌గా చేసిన వివాన్‌, అయ్యప్ప శర్మ, శ్రీనివాస్‌రెడ్డి పాత్రలు ఫర్వాలేదు. ప్రకాష్‌రాజ్‌, రాజీవ్‌ కనకాల, చమ్మక్‌ చంద్ర, బ్రహ్మాజీ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. 

78

టెక్నీకల్‌ః

విజువల్‌గా గ్రాండియర్‌గా ఉంది. త్రిగర్తల రాజ్యం ఎపిసోడ్లు తక్కువగానే ఉంటాయి, కానీ చాలా వరకు గ్రాఫిక్స్ వర్క్ తేలిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ విషయంలో ఇంకాస్త కేర్‌ తీసుకోవాల్సింది. పాటలు, కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర‌ సినిమాకి బలం. బీజీఎం సినిమాని నడిపించింది. పెద్ద అసెట్‌గా నిలిచింది. కెమెరావర్క్ బాగుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదనిపించేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు వశిష్టకిది తొలి చిత్రమే అయినా అద్భుతంగా చేశాడు. తొలి సినిమా దర్శకుడు తీసిన చిత్రమని ఏ సందర్భంలోనూ అనిపించదు. స్క్రీన్‌ప్లే సినిమాకి హైలైట్‌. కాకపోతే కథ విషయంలో ఇంకా కేర్‌ తీసుకుని, ఏదైనా కొత్తగా రాసుకుంటే ఫలితం ఇంకా బాగుండేది. దీంతో ఇప్పుడు ఫాంటసీ, టైమ్‌ ట్రావెల్‌ మిక్స్ చేసిన రొటీన్‌ కమర్షియల్‌ సినిమాగానే మిగిలింది.

88

ఫైనల్‌గాః కళ్యాణ్‌ రామ్‌కి బిగ్‌ కమ్‌ బ్యాక్ నిచ్చే చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చే చిత్రమవుతుంది. 

రేటింగ్‌ః 2.75
Bimbisara Movie review.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories