రవిలో విషయం లేదు, సన్నీకి క్యారెక్టర్ లేదు, షణ్ముఖ్ గాజులు వేసుకో,సిరికి మగాళ్లు కావాలి.. సరయు సంచలన వ్యాఖ్యలు

First Published Sep 13, 2021, 8:34 AM IST

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఎలిమినేషన్ జరిగిపోయింది. అనూహ్యంగా సోషల్ మీడియా సంచలనం సరయు, హౌస్ నుండి బయటికి వచ్చేశారు. బోల్డ్ కామెంట్స్, బూతులతో ఫేమస్ అయిన సరయు హౌస్ లో దమ్ దమ్ చేస్తుంది అనుకుంటే ఒక్కవారానికే, ప్రయాణం ముగిసింది. 
 

ఎలిమినేటైన సరయు, బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అరియానా హోస్ట్ గా ఉన్న ఈ కార్యక్రమంలో సరయు ఆవేశంతో ఊగిపోయారు. హౌస్లోని కొందరు కంటెస్టెంట్స్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి గురించి అడుగగా.. యాంకర్ రవిలో విషయం లేదని, పైకి మంచిగా నటించే, చెడ్డవాడు అంటూ రవిపై నెగిటివ్ కామెంట్స్ చేసింది. 
 

ఆ తరువాత యూట్యూబర్ సిరి హన్మంత్ పై సరయు విరుచుకుపడ్డారు. ఆమె మగాళ్లను అడ్డం పెట్టుకొని ఆడుతుంది. ఒక మగాడు ఉంటే నా పని అవుతుంది, అనుకునే రకం అని ఏకిపారేసింది. 


మరో కంటెస్టెంట్ వీజే సన్నీ ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సరయు. విజే సన్నీకి అసలు క్యారెక్టర్ లేదని, అతనిపై మండిపడ్డారు. ముఖ్యంగా షణ్ముఖ్ పై ఆవేశపూరిత కామెంట్స్ చేశారు. 

షణ్ముఖ్ నిజంగా నువ్వు మాగోడివైతే, దమ్ము ధైర్యం ఉంటే సరిగా ఆడు, లేదంటే గాజులు వేసుకో.. అంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

కంటెస్టెంట్ విశ్వ గురించి మాత్రం సరయు పాజిటివ్ గా స్పందించారు. హౌస్ లో ఉన్నవాళ్ళలో మగవాడు ఎవరంటే... ఒక్క విశ్వ మాత్రమే అని ఆమె అభిప్రాయ పడ్డారు. 


ఎలుకలు మాత్రమే గుంపులుగా వస్తాయని, సింహం సింగిల్ గా ఉంటుంది అంటూ... వీర లెవెల్ మాస్ హీరో డైలాగ్స్ కొట్టిన సరయు ప్రోమో సంచలనంగా మారింది. మరి పూర్తి ఎపిసోడ్ లో ఎలాంటి సంచనాలు ఉంటాయో చూడాలి. 

click me!