ఉల్లిపొర లాంటి పైటచాటు నుండి ఎద సంపద చూపిస్తూ కవిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ మోనాల్, మైండ్ బ్లాక్ చేస్తున్నఅందాలు

First Published Oct 3, 2021, 11:09 AM IST

బిగ్ బాస్(Bigg boss) సీజన్ 4 లో మోనాల్ గజ్జర్(Monal gajjar) ఓ సంచలనం. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మోనాల్ ఫైనల్స్ కి ముందు వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మహామహులను పక్కకు నెట్టి, ఆమె చాలా వారాలు హౌస్ లో గడిపారు. 
 

మొదట్లోమ్ మోనాల్ ఆట తీరు చూసిన ప్రేక్షకులు ఆమె ఎక్కువ కాలం హౌస్ లో ఉండదు అనుకున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఏడ్చేస్తూ, జనాలను విసిగించేసేది. అయితే మెల్లగా ఆమె తన ఆట తీరు మార్చారు. 

ప్రేక్షకులకు కావలసిన మసాలా అందించి, బిగ్ బాస్ సీజన్ ని బాగా క్యాష్ చేసుకున్నారు. మోనాల్-అఖిల్ ప్రేమ వ్యవహారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వీరి వ్యవహారం సాగింది. 

ముఖ్యంగా మోనాల్, అఖిల్ ప్రేమ కోసం పరితపించేది. గేమ్ లో అతని కోసం త్యాగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా మోనాల్  అఖిల్ తో మంచి బాండింగ్ రిలేషన్ మైంటైన్ చేయడం విశేషం. 

మోనాల్ అఖిల్ కలసి ఓ వెబ్ సిరీస్ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ సిరీస్ ప్రోగ్రెస్ ఏమిటో తెలియాల్సి ఉంది.
హౌస్ నుండి బయటికి వచ్చాక ఐటెం సాంగ్స్, చిన్న చిన్న ఆఫర్స్ తో పాటు డాన్స్ షోలో జడ్జిగా సందడి చేసిన మోనాల్, ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు. అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాదిరి, ఆమెను కూడా జనాలు మర్చిపోయినట్లు ఉన్నారు. 


అల్లుడు అదుర్స్ మూవీలో ఐటెం భామగా మెరిసిన మోనాల్ కి, అలాంటి అవకాశాలు కూడా రావడం లేదు. టాలీవుడ్ లో ఆమెకు మరలా అవకాశాలు కనుమరుగయ్యాయి. 

దీనితో మోనాల్ కెరీర్ మరలా మొదటికే వచ్చిందన్న భావన కలుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న వారిలో అరియానా, సోహైల్, దివి కెరీర్ చాలా బాగున్నాయి. టైటిల్ విన్నర్ అభిజీత్ ఊసే లేదు. ఈ మధ్య తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అభిజీత్ తెలియజేయడం విశేషం. 
 

కెరీర్ సంగతి అలా ఉంటే, మోనాల్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా ట్రెండీ లెహంగా చోళీ ధరించి, ఎద సంపద చూపిస్తూ హీటెక్కించారు. మోనాల్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారాయి. 

click me!