ప్రగ్నెన్సీ టైంలో ఆడవాళ్ల శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు వస్తాయి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ టైంలో చాలా మంది ఆడవారికి తలనొప్పి, వాంతులు, మైకము, ఊబకాయం, ముఖంపై మొటిమలు, చేతులు, కాళ్ల వాపులు వస్తుంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో పాదాల వాపు అనేది సర్వ సాధారణ సమస్య. దీన్ని వైద్య భాషలో ఎడెమా అంటారు. అయితే ఈ వాపు చేతులు, ముఖంపై కనిపిస్తే ఇది ప్రీక్లాంప్సియాకు సంకేతంగా భావిస్తారు.