సెట్స్ లో ఎన్టీఆర్ చేసిన పనికి బండబూతులు తిట్టిన గుణశేఖర్!

First Published Apr 14, 2021, 3:18 PM IST

 పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు, ఆదిలోనే గొప్ప నటుడిగా నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పోలికతో పుట్టిన ఎన్టీఆర్, ఆయన వారసుడిగా అరంగేట్రమే పౌరాణిక చిత్రంతో చేశారు. ఎన్టీఆర్ మొదటి చిత్రం బాల రామాయణం విడుదలైన నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు. 
 

గుణశేఖర్ దర్శకత్వంలో ఎం ఎస్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కింది బాల రామయం. ఈ మూవీ తెరకెక్కే నాటికి ఎన్టీఆర్ వయసు కేవలం పదేళ్లు మాత్రమే. పదేళ్ల ప్రాయంలోనే రాముడిగా వెండితెరపై ఎన్టీఆర్ అద్భుతం చేశాడు. 1996 ఏప్రిల్ 14న విడుదలైన బాల రామయం బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ కేటగిరిలో జాతీయ అవార్డు అందుకుంది.
undefined
ఈ మూవీ చిత్రీకరణ సమయంలో జరిగిన అనేక విశేషాలు, కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ పంచుకున్నాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి గుణశేఖర్ సీరీయస్ కావడంతో, భయకరంగా తిట్టారట.
undefined
బాల రామాయణంలో నటించిన పిల్లలు అందరు, కోతుల తీరు అల్లరి చేసేవారట. వీరితో చిత్రీకరణ ప్రతిరోజు ఒక యుద్ధం లాగే ఉండేదట. ఇక చిన్నతనంలో జూనియర్ ఎన్టీఆర్ చాల అల్లరి పిల్లాడట.
undefined
బాల రామాయణం షూటింగ్ సెట్స్ లో కూడా ఎన్టీఆర్ అల్లరి మాములుగా ఉండేది కాదట. వీరి అల్లరి దర్శకుడు గుణశేఖర్ కి పెద్ద తలనొప్పిగా మారేది అట.
undefined
ఓ రోజు రామాయణంలోని కీలకమైన సీతా స్వయంవరం సీన్ చిత్రీకరణ ఉందట. దానికి కోసం అవసరమైన సెటప్ మొత్తం అరేంజ్ చేశారట అసిస్టెంట్ డైరెక్టర్స్. స్వయంవరం సీన్ లో శివధనస్సు విరిచే ఘట్టం ఉంటుంది. దాని కోసం ఓ విల్లు సిద్ధం చేశారు.
undefined
కొద్దినిమిషాల్లో ఆ సీన్ షూటింగ్ అనగా, ముందుగానే ఆ విల్లును ఎన్టీఆర్ విరిచి వేశాడట. సెట్స్ కి వచ్చిన గుణశేఖర్ కి విరిగిపోయిన విల్లు చూడగానే కోపం నషాళానికి ఎక్కిందట. ఎన్టీఆర్ ఆ విల్లు విరిచేశాడని తెలుసుకొని బాగా తిట్టేశాడట.
undefined
సన్నివేశం చిత్రీకరణకు కావలసిన విల్లు విరిగిపోవడంతో ఆ షూట్ డిస్ట్రబ్ అయ్యిందట. దానితో జూనియర్ ఎన్టీఆర్ పై గుణశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడట. పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్, ఈ విషయం బయటపెట్టారు.
undefined
అలాగే లక్ష్మణుడు రోల్ వేసిన నారాయణ నిఖిల్ సీత పాత్ర చేసిన స్మిత మాధవ్ కి లవ్ లెటర్ రాశారట.
undefined
ఆ లెటర్ రాసినది ఎవరో తెలియక, పెద్ద గందర గోళం ఏర్పడిందట. అందరికి ఎన్టీఆర్ పైనే డౌట్ వచ్చిందట.
undefined
ఇలాంటి సరదా సంఘటనలు ఎన్నో బాల రామాయణం షూటింగ్ సమయంలో జరిగాయట.
undefined
undefined
click me!