చిరంజీవిపై అలిగిన అనసూయ.. అయ్యే మెగాస్టార్ చేత సారీ చెప్పించుకుందిగా..

First Published Oct 5, 2022, 7:00 AM IST

మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ హంగామా వరల్డ్ వైడ్ గా మొదలైంది. విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రం నేడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 

మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ హంగామా వరల్డ్ వైడ్ గా మొదలైంది. విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రం నేడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బోలెడు అంచనాలు పెట్టుకున్న ఆచార్య నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో సోషల్ మీడియాలో మెగా హంగామా మొదలయింది. 

ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్టింగ్ ఉంది. నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే యాంకర్ అనసూయ కూడా ఒక పాత్రలో నటించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అనసూయకి సారీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 

చిరంజీవి అనసూయకి సారీ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్ళాలసిందే. ఇటీవల గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ప్రసంగిస్తున్నప్పుడు జోరున వర్షం కురిసింది. దీనితో చిరు ఎక్కువసేపు ప్రసంగించలేకపోయారు. చిరంజీవి ఏ ప్రీరిలీజ్ వేడుకలో అయినా సరే అందరి గురించి పేరు పేరునా చెబుతారు. కానీ వర్షం కారణంగా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు పేర్లు ప్రస్తావించలేదు. 

అందులో అనసూయ పేరు కూడా ఉంది. దీనితో అనసూయ చిరంజీవిపై అలిగిందట. మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్నీ చిరు ప్రస్తావించారు. తన పేరు చెప్పలేదని ఒక అమ్మాయి నాపై అలిగింది. అది అనసూయ.. సారీ అమ్మా నీ పేరు మరచిపోయాను అంటూ చిరంజీవి ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. 

ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పేరు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరచిపోయా అని చిరంజీవి అన్నారు. మొత్తంగా అనసూయ మెగాస్టార్ చేతే సారీ చెప్పించుకుంది. అయితే అనసూయపై కొందరు ట్రోల్ చేస్తున్నారు. వర్షం కారణంగా చిరంజీవి కొందరు పేర్లు చెప్పలేకపోవచ్చు. అంతమాత్రానికే అలిగేయాలా అని అనసూయని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

అయితే ఇది చిరంజీవి, అనసూయ మధ్య సరదాగా జరిగిన సంఘటన అని.. దీనిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. అనసూయ కూడా ఈ చిత్రంలో బాగా నటించింది అని చిరు ప్రశంసించారు. గాడ్ ఫాదర్ చిత్రానికి ఆల్రెడీ పాజిటివ్ టాక్ షురూ కావడంతో బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది. 

click me!