అల్లు అర్జున్ జాతకం, శని ఆరో గదిలో ఉండటం వల్ల నష్టం జరిగిందా ? రాబోయే 10 ఏళ్లు బన్నీ కెరీర్ ఎలా ఉండబోతోంది?

Published : Sep 11, 2025, 11:52 AM IST

Allu Arjun Horoscope: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ జాతకం ఎలా ఉంది. రాబోయే 10 ఏళ్లు ఆయన కెరీర్ ఎలా ఉండబోతోంది. స్టార్ గా కొనసాగుతాడా? జ్యోతీష్యుడు చెప్పిన సంచలన విషయాలు ఏంటి? 

PREV
17
Allu Arjun Horoscope

పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్

పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే. పుష్పకు ముందు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిన బన్నీ.. ఆతరువాత పాన్ ఇండియాను షేక్ చేశాడు. మరీ ముఖ్యంగా నార్త్ లో, యూపీ, బీహార్ లో కూడా అల్లు అర్జున్ కు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. పుష్ప సినిమాకు ఉత్తరాదినుంచే 800 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయంటే.. బన్నీని అక్కడ ఎంత ఓన్ చేసుకున్నారన్న సంగతి అర్ధం అవుతోంది. ఈక్రమంలో అల్లు అర్జున్ సౌత్ ఇండియాన్ స్టార్ మాత్రమే కాదు, ఓవర్ ఆల్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారినట్టే అని అర్ధం అవుతోంది.

27
Allu Arjun Horoscope

అల్లు అర్జున్ జాతకం ఎలా ఉంది?

అయితే అల్లు అర్జున్ కెరీర్ నెక్ట్స్ ఎలా ఉండబోతోంది? బన్నీ అన్ని అడ్డంకులు దాటుకుని పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా ఎదుగుతారా? తరువాతి పదేళ్లలో ఆయన జాతకం ఎలా ఉండబోతోంది. గతంలో అల్లు అర్జున్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కు జాతకంతో సంబంధం ఉందా? నెక్ట్స్ బన్నీ లైఫ్ ఎలా ఉండబోతోంది. ఆయన జాతకం గురించి జ్యోతీష్యుడు చెప్పిన రహస్యం ఏంటి? అల్లు అర్జున్ స్టార్ హీరోగా వరుస హిట్లు కొడుతున్న సంగతి తెలిసిందే. పుష్ప, పుష్ప2తో ఆయన ఇమేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిందో చూస్తూనే ఉన్నాం. పుష్ప2 సినిమా బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసి, దాదాపు 1900 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది పుష్ప2.

37
Allu Arjun Horoscope

పుష్ప2 వివాదం

ఇంత భారీ విజయం సాధించిన బన్నీ.. ఈసినిమా వల్లే జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈమూవీ బెనిఫిట్ షో వల్ల జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోవడం, అప్పుడు థియేటర్ లో అల్లు అర్జున్ ఉండటం, ఆయన మీద కేసు, ఒక రోజు జైల్లో గడపడం లాంటి విషయాలు బన్నీ ప్యాన్స్ ను కలవరపెట్టాయి. కాని సినిమా విజయం వారికి ఊరటనిచ్చింది. అయితే ఈ సినిమా విజయోత్సవాలు చేసుకోలేకపోయారు పుష్ప2 టీమ్. ఈక్రమంలో అల్లు అర్జున్ జాతకం గురించి ప్రముఖ సినిమా జ్యోతీష్యుడు వేణు స్వామి చెప్పిన విషయాలు గతంలో వైరల్ అయ్యాయి.

47
Allu Arjun Horoscope

బన్నీకి రాజయోగం?

అల్లుఅర్జున్ జాతకం బాగుంది, ప్రస్తుతం ఆయనే పాన్ ఇండియన్ సూపర్ స్టార్, బన్నీ రేంజ్ ఇప్పుడు ఎవరీకీ లేదు. నెక్ట్స్ 10 ఏళ్లు అల్లు అర్జున్ సినిమాలకు తిరుగు ఉండదు. దేశంలో నెంబర్ వన్ స్థానం లో ఉంటాడని ఏడాది క్రితమే వేణు స్వామి చెప్పారు. ఆతరువాత కాలంలో బన్నీ జైలుకు వెళ్లాడు, ఆయనకు బ్యాడ్ టైమ్ నడిచింది కదా అంటే... జైలుకి వెళ్లే ఇమేజ్ పోదు, రాజయోగం వస్తుంది అని వేణు స్వామి అన్నారు. పెద్ద పెద్ద నాయకులంతా జైలుకి వెళ్ళాకే సీఎంలు అయ్యారు. కారాగార దోషం ఉంటే ఇలా జరుగుతుంది. దానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అని వేణు స్వామి అన్నారు.

57
Allu Arjun Horoscope

వేణు స్వామి ఏమన్నారు?

అంతే కాదు అల్లు అర్జున్ జాతకంలో శని ఆరోగదిలో ఉండటం వల్ల అలా జైలుకు వెళ్లడం జరిగింది. అంతే కాదు ఇఫ్పటికీ ఎప్పటికీ అల్లు అర్జున్ ఇండియన్ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతాడు అని వేణుస్వామి జాతకం చెప్పారు. అయితే పుష్ప2 కంటే ముందే బన్నీ పాన్ ఇండియాను షేక్ చేస్తాడని చెప్పారు వేణుస్వామి. దాంతో ఆయన జాతకంపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

67
Allu Arjun Horoscope

సినిమా జ్యోతీష్యుడిగా వేణు స్వామికి పేరుంది. పలు వివాదాల్లో కూడా ఆయన చిక్కుకున్నారు. సినిమావాళ్ల విడాకులు, మరణాలపై ఆయన చేసిన కామెంట్స్ వివాదం అయ్యాయి. కొన్ని కేసులు కూడా ఆయనపై పెట్టడం జరిగింది. ప్రస్తుతం సినిమా జాతకాలు చెప్పడం మానేశారు వేణు స్వామి. గతంలో చెప్పిన జాతకాల విషయంలోనే కొన్ని అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రభాస్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య , రాజమౌళి లాంటి స్టార్స్ కు సబంధించి ఆయన చెప్పిన జాతకాలు వైరల్ అయ్యాయి.

77
Allu Arjun Horoscope

అల్లు అర్జున్ సినిమాలు?

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ కంటెంట్ తో ఈమూవీ రూపొందుతుంది. ఈ సినిమా పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈమూవీ పనుల కోసం అల్లు అర్జున్ ముంబయ్ లో ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని మరీ అక్కడే ఉంటున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కతున్న ఈసినిమాను నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories