ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఎస్‌ఎస్ రాజమౌళి bముందు ఉన్నారు. అపజయమే ఎరుగుని దర్శకుడిగా ఆయనకు పేరుంది. తెలుగు పరిశ్రమను హాలీవుడ్ స్టాయిలో నిలబెట్టాడు రాజమౌళి. అంతే కాదు టాలీవుడ్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్, కోలీవుడ్ లను కూడా రూల్ చేసేంతగా మన సినిమాల ఇమేజ్ ను పెంచి, ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు. చిన్న హీరోలు, స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి సూపర్ సక్సెస్ చేసిన ఆయన, ప్రస్తుతం హాలీవుడ్ లో టాలీవుడ్ జెండా ఎగరేసే పనిలో ఉన్నారు.