అదే ఏడాది పల్నాటి పౌరుషం విడుదలైన కేవలం వారం రోజుల వ్యవధిలో ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎర్రసైన్యం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. పల్నాటి పౌరుషం కథ, ఎర్రసైన్యం కథ పూర్తిగా భిన్నమైనది.
ఎర్రసైన్యం సినిమాకు కథ, దర్శకత్వం ఆర్. నారాయణమూర్తి అందించారు. అలాగే.. ఆయనే లీడ్ రోల్ లో నటించారు. ఇందులో ఉదయభాను (ఆమె తొలి సినిమా), తెలంగాణ శకుంతల, గూడ అంజయ్య, ముక్కురాజు మొదలైన వారు ఇతర పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా, గద్దర్, వరికుప్పల యాదగిరి, గూడ అంజయ్య వంటి ప్రజా కవులు పాటలు రాశారు. ఈ సినిమా రైతుల కష్టాలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఎర్ర విప్లవకారుల జీవన శైలిని చూపించింది. పాటలు, మాటలు పూర్తిగా ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాయి.