Allu Arjun and Atlee AA22 A6 Movie Budget: బాహుబలితో తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోయింది. ఆతర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్, పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలు దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఈ కారణాల వల్ల, తెలుగులో రాబోయే పెద్ద బడ్జెట్ సినిమాలు అన్నీ పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయడం మొదలుపెట్టారు.
Also Read: ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?
అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ విత్ అట్లీ
అట్లీ - అల్లు అర్జున్ సినిమా బడ్జెట్
ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించే సినిమాలు బయటకు వస్తున్నాయి. అలాంటి ఒక భారీ సినిమా అనౌన్స్ మెంట్ తాజాగా వచ్చింది. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు టీమ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా.. భారీ బడ్జెట్ తో, అద్భుతమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతే కాదు ఈసినిమా బడ్జెట్, స్టార్స్ రెమ్యునరేషన్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జవాన్ తో సహా పెద్ద హిట్ సినిమాలు తీసిన అట్లీ, పుష్ప హీరో కలిసి చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్ల రూపాయలు అని పింక్ విల్లా తెలిపింది.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అలేఖ్య చిట్టి, ముగ్గురు సిస్టర్స్ లో ఎవరికి అవకాశం?
అల్లు అర్జున్, అట్లీ జీతం
అల్లు అర్జున్, అట్లీ రెమ్యునరేషన్ ఎంత?
ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం మాత్రమే 250 కోట్లు సన్ పిక్చర్స్ ఖర్చు చేస్తోంది. ఇక పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఈసినిమా కోసం దాదాపు 200 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కాకుండా సినిమా లాభాల్లో నుంచి 15 శాతం షేర్ కూడా అల్లు అర్జున్ కు దక్కుతుంది. ఇక డైరెక్టర్ అట్లీ కెరీర్ లో ఇది 6వ సినిమా. ఈ సినిమా కోసం ఆయనకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారని సమాచారం.
Also Read: కమల్ హాసన్ లేడీ వాయిస్‌తో పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అందులో హిట్ సాంగ్స్ ఇవే?
AA22 x A6 మూవీ
హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్ - అట్లీ సినిమా
అట్లీ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునేలా ఒక పాన్ వరల్డ్ సినిమాగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ లోని టాప్ స్టూడియోలలో ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు జరుగుతున్నాయి. బడ్జెట్ చూస్తే రాజమౌళి కొత్త సినిమా కంటే AA22 x A6 (అల్లు అర్జున్ 22వ సినిమా మరియు అట్లీ 6వ సినిమా) సినిమా బడ్జెట్ తక్కువే. మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా బడ్జెట్ 1000 కోట్లు అని సమాచారం. మరి ఈసినిమాలతో సౌత్ సినిమా ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.
Also Read: సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?