Bigg Boss Telugu Season 9: Who Among Alekhya Chitti pickles Sisters: కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదం అవుతున్న అలేఖ్య చిట్టి సిస్టర్స్ గురించి అందరికి తెలిసిందే. పచ్చళ్ల పేరుతో గతంలోనే పాపులర్ అయిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకుని మంరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం వీరి వివాదం సోషల్ మీడియా అంతటా మారుమోగిపోతుంది. ముగ్గురు అక్కా చెల్లెల్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?
అలేఖ్య చిట్టి పికిల్స్ తో పాటు, సోషల్ మీడియా పోస్ట్ లు, ముగ్గురు మూడు యూట్యూబ్ ఛానల్స్ తో చేతినిండా సంపాదిస్తున్నారు. అయితే పచ్చళ్లను మాత్రం చాలా ఎక్కువ రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే మీ పచ్చళ్లు ఎందుకు అంత కాస్ట్ అని అడిగిన కస్టమర్స్ తో, అలేఖ్య దురుసుగా మాట్లాడిన వాట్సాప్ ఆడియో రికార్డు ఒకటి లీక్ అవ్వడంతో పెద్ద దుమారమే రేగింది. కష్టమర్స్ ను బూతులు తిడుతూ.. నోటికి వచ్చినట్టుగా రెచ్చిపోయి మాట్లాడింది అలేఖ్య. దాంతో అలేఖ్య పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.
అంతే కాదు సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన మీమ్స్,ట్రోల్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ కూడా ఆమె పై స్పూఫ్ వీడియోలు చేస్తున్నారు. ఆమె చేసిన పనిని విమర్శిస్తు కామన్ ఆడియన్స్ కూడా రెచ్చిపోయి విమర్శలు చేయడంతో.. దెబ్బకు అలేఖ్య పచ్చళ్ళ వ్యాపారం మూతపడింది. అలేఖ్య ప్రెజర్ తో హాస్పటల్ లో చేరింది. వెంటనే సెంటిమెంట్ గేమ్ ప్లే చేసి.. మరికొన్ని వీడియోలు రిలీజ్ చేయడం మొదలు పెట్టారు ముగ్గురు సిస్టర్స్.
ఇక ఇలా ఓవర్ నైట్ లో ట్రెండింగ్ టాపిక్ గా నిల్చిన అలేఖ్య చిట్టిని బిగ్ బాస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి గతంలో సినిమా సెలబ్రిటీలు మాత్రమే వచ్చేవారు. కాని ఆతరువాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయంజర్స్ ను కూడా తీసుకువరావడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలో కాంట్రవర్సీ అయిన స్టార్స్ పై బిగ్ బాస్ టీమ్ కన్ను ఎప్పుడూ ఉంటుంది. గత సీజన్ లో రాజ్ తరుణ్ వివాదంలో పాపులర్ అయిన ఆర్ జే శేఖర్ భాషాను బిగ్ బాస్ టీమ్ తీసుకువచ్చింది.
Alekhya Chitti Pickles
ఇక ఇప్పుడు పచ్చళ్ల కాంట్రవర్సీలో పాపులర్ అయిన అలేఖ్య చిట్టిని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. అవకాశం వస్తే మాత్రం అలేఖ్య సిస్టర్స్ లో ఎవరో ఒకరు బిగ్ బాస్ లోకి రావడం పక్కా అంటున్నారు. ఈ ముగ్గురు సిస్టర్స్ లో రమ్య సోషల్ మీడియాలో మోడ్రన్ డ్రస్ లతో రచ్చ చేస్తుంటుంది. ఒక వేళ రమ్యను అయినా బిగ్ బాస్ లోకి తీసుకోవాలని టీమ్ భావిస్తుందట. మరి బిగ్ బాస్ లోకి అలేఖ్య సిస్టర్స్ లో ఎవరు వస్తారో చూడాలి.