బాహుబలి, కేజీఎఫ్‌, రోబో, ఇప్పుడు పుష్ప.. నెక్ట్స్ `మగధీర` పార్ట్ 2 రాబోతుందా? రాజమౌళి నెక్ట్స్ ప్లాన్‌ అదేనా?

First Published Jun 30, 2021, 8:32 PM IST

భారీ బడ్జెట్‌ చిత్రాలు పాన్‌ ఇండియా సినిమాలు రెండు పార్ట్ లుగా రావడం ఇప్పుడొక ట్రెండ్‌ అవుతుంది. ఇప్పటికే `బాహుబలి`, `రోబో` రెండు భాగాలుగా సక్సెస్‌ సాధించాయి. ఇప్పుడు `కేజీఎఫ్‌`, `పుష్ప` వస్తున్నాయి. ఈ జాబితాలో `మగధీర` కూడా చేరుతుందట. 

`బాహుబలి` చిత్రం రెండు భాగాల ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఒక్క సినిమాగానే ప్రారంభమైన ఈ చిత్రం మధ్యలో కథ ఒక్క భాగంలో అంటే రెండున్నర గంటల్లో చెప్పడానికి సెట్‌ కావడం లేదు. దీంతో రెండు పార్ట్ లుగా చేశారు రాజమౌళి. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల కోట్లకుపైగా, రెండో భాగం 1500 కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది.
undefined
దీంతో దీన్ని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుని దర్శకుడు శంకర్‌సైతం `రోబో`ని సీక్వెల్‌ ప్రకటించారు. రజనీకాంత్‌తోనే `2.0`చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది కూడా భారీ కలెక్షన్లని రాబట్టింది.
undefined
మరోవైపు `బాహుబలి`ని స్ఫూర్తిగా తీసుకుని `కేజీఎఫ్‌` చిత్రాన్ని రెండుగా తీసుకొస్తున్నారు యశ్‌, ప్రశాంత్‌ నీల్‌, హోంబలే ఫిల్మ్స్ అధినేత. ప్రస్తుతం `కేజీఎఫ్‌ఃఛాప్టర్‌ 2` విడుదలకు రెడీగా ఉంది. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌ వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తుంది.
undefined
అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం `పుష్ప`. దీన్ని ప్యాన్‌ ఇండియా చిత్రంగా తీసుకురాబోతున్నట్టు మొదట్లోనే ప్రకటించారు. కానీ కథ పెద్దగా ఉండటంతో ఇటీవల రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్టు,అలాగే బడ్జెట్‌ కూడా పెంచినట్టు తెలిపారు. గ్రాండియర్‌గా దీన్ని తెరకెక్కించే పనిలో బన్నీ, సుకుమార్ బృందం బిజీ అయ్యింది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ నటుడు ఫాహద్‌ పాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. మొదటి భాగాన్ని ఆగస్ట్ 13కి విడుదల చేయాలనే ప్లాన్‌ ఉంది.
undefined
ఈ సినిమాలన్నీని దృష్టిలో పెట్టుకుని, తాను క్రియేట్‌ చేసిన ట్రెండ్‌ని తానే ఫాలో అవ్వాలని భావిస్తున్నారట జక్కన్న. 2009లో రామ్‌చరణ్‌, కాజల్ జంటగా రూపొందించిన సంచలన చిత్రం `మగధీర`కి పార్ట్ 2 తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు ఇప్పుడు తండ్రి, రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ `మగధీర` పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం.
undefined
దీనిపై గతంలోనూ విజయేంద్రప్రసాద్‌ `మగధీర2` కథని రాస్తున్నట్టు తెలిపారు. రాజమౌళి సైతం పలు సందర్భాల్లో హింట్‌ ఇచ్చాడు. ఇప్పుడు భారీ సినిమాలు రూపొందుతున్నాయి. తెలుగు సినిమా మార్కెట్‌ పెరిగింది. పాన్ ఇండియా సినిమాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమయంలో `మగధీర` పార్ట్ 2 తీస్తే ఇండియన్‌ సినిమా రికార్డులను తిరగరాస్తుందని భావిస్తున్నారట. అందులో భాగంగానే రాజమౌళి కుదిరితే తన నెక్ట్స్ సినిమాగా `మగధీర 2`నే ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడీ వార్త మాత్రం జక్కన,రామ్‌చరణ్‌ అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తుంది.
undefined
ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమానికి ముందు యంగ్‌ అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగబోతుంది. అల్లూరిగా రామ్‌చరణ్‌,కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయబోతున్నారు. దాదాపు పది భాషల్లో సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ జరుగుతుంది.
undefined
click me!