Published : Mar 05, 2025, 12:44 PM ISTUpdated : Mar 05, 2025, 12:45 PM IST
అంతరంగాలు, కళంకిత సీరియల్స్ హీరోయిన్ అశ్విని గుర్తుందా.. హిట్లర్ సినిమాలోమెగాస్టార్ చెల్లలి పాత్రలో నటించిన ఈ బ్యూటీ, డైరెక్టర్ వల్ల తాను ఫేస్ చేసిన లైంగిక వేధింపుల సంఘటనను వెల్లడించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
అశ్విని నంబియార్ అంటే ఎవరికి అర్ధం కాకపోవచ్చు కాని.. అంతరంగాలు, కళంకిత సీరియల్స్ హీరోయిన్ అంటే మాత్రం వెంటనే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తుంది అశ్విని. చిన్నప్పటి నుంచే మోడలింగ్ రంగంపై దృష్టి పెట్టింది నటి అశ్విని నంబియార్. ఆమె మోడల్‌గా నటించిన చాలా యాడ్స్ మలయాళ మ్యాగజైన్స్‌లో వచ్చాయి. అది చూసిన తర్వాతే ఆమెకు తెలుగు, తమిళం, మలయాళం సహా ఇతర భాషల్లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.
ఆ విధంగా, డైరెక్టర్ ఇమయం భారతీరాజా డైరెక్షన్‌లో 1991లో వచ్చిన "పుదు నెల్లు పుదు నాత్తు" సినిమాలో నటించింది. ఆమె క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. దాంతో ఇతర భాషల్లొ కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఈక్రమంలోనే ఈటీవీలో సీరియల్స్ లో నటించే అవకాశం ఇచ్చారు సుమన్. సెంటిమెంట్ పాత్రలు చేయడంలో అశ్విని తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించింది.
భారతీరాజా డైరెక్షన్‌లో 1993లో విజయకుమార్, రాధిక, నెపోలియన్ సహా చాలా మంది ప్రముఖులు నటించిన "కిళక్కు సీమయిలే" సినిమాలో అశ్విని నంబియార్ నటించింది. 16 ఏళ్లకే హీరోయిన్‌గా చేసిన ఆమెకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది.
ఆతరువాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా హిట్లర్ సినిమాలో నటించింది అశ్విని. తెలుగులో ఆమె టెలివిజన్ నటిగానేబాగా ఫేమస్ అయ్యింది. సినిమాల్లో మాత్రం ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేసింది.
ఆ తర్వాత చాలా సంవత్సరాలు సౌత్ ఇండియన్ భాషా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన అశ్విని నంబియార్ పెళ్లయ్యాక కూడా నటిస్తూనే ఉంది. 2007లో "ఓరం పో" అనే సినిమాలో కనిపించింది. కాని టాలీవుడ్ లో మళ్లీ సినిమాలు చేయలేదు ఈ సీనియర్ తార.
సూజల్ వెబ్ సిరీస్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటించింది:
ప్రస్తుతం రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన సూజల్ వెబ్ సిరీస్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటించింది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది అశ్విని నంబియార్. ఇక షూటింగ్స్ టైమ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా వెల్లడించింది అశ్విని. తనపై లైంగికంగా వేధింపులకు కూడా ప్రయత్నం జరిగిందంటోంది.
అశ్విని నంబియార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు షూటింగ్ స్పాట్‌లో జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పింది. ఒకసారి తన అమ్మ లేకుండా షూటింగ్ స్పాట్‌కి వెళ్లినప్పుడు, డైరెక్టర్ నన్ను పైన ఉన్న రూమ్‌కి పిలుస్తున్నారని చెప్పారు. అప్పుడు నేను చిన్న పిల్లని. మామూలుగా డైరెక్టర్‌ని చూడటానికి వెళ్లాను.
ఆ ఫేమస్ డైరెక్టర్ నన్ను లోపలికి పిలిచాడు. తర్వాత సడెన్‌గా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయన అలా చేస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెంటనే కిందకు దిగి, ఇంటికి వెళ్లిపోయాను అని చెప్పింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ దర్శకుడి పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు.