మెగాస్టార్ చిరంజీవితో గతంలో చాలా మంది హీరోయిన్లు నటించారు. సీనియర్ హీరోయిన్ల విషయానికి వస్తే రాధా, రాధికా, విజయశాంతి, రంభ, రమ్యకృష్ణ, సౌందర్య ఇలా స్టార్ హీరోయిన్లంతా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో గతంలో చాలా మంది హీరోయిన్లు నటించారు. సీనియర్ హీరోయిన్ల విషయానికి వస్తే రాధా, రాధికా, విజయశాంతి, రంభ, రమ్యకృష్ణ, సౌందర్య ఇలా స్టార్ హీరోయిన్లంతా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ కొందరికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు.
24
ఒక సీనియర్ నటి చిరంజీవి చిత్రంలో అవకాశం వసిన్తప్పటికీ రిజెక్ట్ చేసిందట. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల్లో రాణిస్తున్న ఇంద్రజ. ఇంద్రజ బాలకృష్ణ, జగపతి బాబు, సూపర్ స్టార్ కృష్ణ, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో నటించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కి తిరిగి ప్రాణం పోసిన చిత్రం హిట్లర్. ఆ మూవీలో ఇంద్రజకి అవకాశం వచ్చిందట.
34
కానీ హీరోయిన్ పాత్ర కాదు. ఆ చిత్రంలో చిరంజీవి పెద్ద చెల్లెలుగా నటించే ఛాన్స్ వచ్చిందట. తాను చిరంజీవితో నటిస్తే హీరోయిన్ గానే నటిస్తాను అని ఇంద్రజ ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. ఆ మూవీలో హీరోనే గా అప్పటికే రంభ ఫైనల్ అయింది. ఇంద్రజ రిజెక్ట్ చేయడంతో అప్పటి బుల్లితెర నటి అశ్వినిని చిరంజీవి పెద్ద చెల్లెల్లు పాత్రకి ఎంపిక చేశారు.
44
హిట్లర్ చిత్రంలో చిరంజీవి పెద్ద చెల్లెల్లు పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. హిట్లర్ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దర్శకరత్న దాసరి నారాయణ రావు చిరంజీవి తండ్రి పాత్రలో నటించారు.