శ్రీదేవి ఆఫర్‌ని తిరస్కరించిన ఆమిర్‌ ఖాన్‌.. వైరల్‌ అవుతున్న అసలు రీజన్‌!

First Published Aug 13, 2021, 3:36 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్‌లో అందరు టాప్‌ హీరోలతో కలిసి నటించింది. అందులో సల్మాన్‌, షారూఖ్‌ కూడా ఉన్నారు. కానీ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ మాత్రం ఆమెతో కలిసి నటించే ఆఫర్‌ని తిరస్కరించాడు. బాలీవుడ్‌ ఆడియెన్స్ కి ఆ అదృష్టం లేకుండా చేశాడు. ఆమిర్‌ ఈ ఫర్‌ని తిరస్కించడానికి కారణాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

శ్రీదేవిని ఒక్క మాటల్లో చెప్పాలంటే ఇండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌గా చెప్పొచ్చు. హీరోల డామినేషన్‌ రోజుల్లోనూ వాళ్లకి మించిన ఇమేజ్‌తో రాణించిన ఘనత ఒక్క శ్రీదేవికే దక్కింది. అగ్రహీరోలకు మించిన పారితోషికం అందుకున్న ఘనత కూడా ఆమెకే దక్కిందంటే అతిశయోక్తి కాదు. 
 

చాలా వరకు ఫలానా హీరో సినిమా వస్తుందని ప్రచారం చేస్తుంటారు. కానీ ఆమె టైమ్‌లో శ్రీదేవి సినిమాగా ప్రచారం జరిగేది, ఆడియెన్స్ కూడా అలాగే మాట్లాడుకునే వాళ్లు. అంతగా ఆమె ఇండియన్‌ సినిమాని శాషించారంటే అతిశయోక్తి కాదు. నేడు శ్రీదేవి బర్త్ యానివర్సరీ. ఈ సందర్భంగా ఓ అరుదైన విషయం వైరల్‌ అవుతుంది. శ్రీదేవితో కలిసి నటించే ఆఫర్‌ని మిస్టర్‌ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌ తిరస్కరించడం. 

ఆ సంగతులు చూస్తే.. ఆమిర్‌ ఖాన్‌ డెబ్యూగా పరిచయం కావాల్సిన సినిమా `ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌`. హీరోగా ఆయనకు ఓ రకంగా డెబ్యూ అని చెప్పొచ్చు. ఇందులో హీరోయిన్‌గా శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు. ఆమె ఓకే చెప్పింది. అమీర్‌ ఖాన్‌కిది పర్‌ఫెక్ట్ లాంచ్‌ అవుతుందని మేకర్స్ భావించారు. వీరిద్దరితో కలిసి ఫోటో షూట్‌ కూడా చేశారు. 
 

ఇద్దరి స్క్రీన్‌ ప్రజెన్స్ బాగుంది. ఆ ఫోటో షూట్‌ వైరల్‌గానూ మారింది. కానీ ఉన్నట్టుంది ఆమీర్‌ ఖాన్‌ మేకర్స్ కి షాక్‌ ఇచ్చాడు. శ్రీదేవితో తాను చేయలేనని స్పష్టం చేశారు. ఓ కొత్త హీరోకి శ్రీదేవిలాంటి సూపర్‌ స్టార్‌ డేట్స్ ఇవ్వడమే కష్టం. అసలు ఇవ్వదు కూడా. కానీ దర్శకుడు మన్సూర్‌ ఖాన్‌, నిర్మాత నజీర్‌ హుస్సేన్‌లు ఆమెని ఒప్పించారు. కానీ ఆమీర్‌ నో చేయనని చెప్పాడు. పైగా ఈ చిత్రానికి ఆమిర్‌ ఓ రైటర్‌ కూడా.

అయితే ఆమిర్‌.. శ్రీదేవికి నో చెప్పడానికి కారణాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. శ్రీదేవి తన కంటే ఏజ్‌లో చాలా పెద్దది. స్క్రీన్‌పైన కూడా తనకంటే ఆమె పెద్దగా కనిపిస్తుందట. ఆమీర్‌ శ్రీదేవి ముందు తేలిపోతున్నారని ఆయన టీమ్‌, ఫ్రెండ్స్ చెప్పారట. దీంతో అది సినిమాపై ప్రభావం పడుతుందని ఆయన సన్నిహితులు చెప్పడంతో ఆమిర్‌ శ్రీదేవితో చేయనని చెప్పారట. 
 

ఆ తర్వాత యంగ్‌ హీరోయిన్‌ జూహీ చావ్లాని తీసుకున్నారట. అలా ఆమిర్‌, జూహీ చావ్లా కలిసి నటించిన `ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌` చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. భారీ కలెక్షన్లని రాబట్టింది. తొలి చిత్రంతోనే ఆమిర్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ వెంటనే చేసిన `రాఖ్‌` చిత్రంలో అద్భుతమైన నటనతో ఫిదా చేశాడు. దీంతో ఆయన నటనకు మెప్పించిన నేషనల్‌ అవార్డ్ జ్యూరీ ఈ రెండు చిత్రాలకు గానూ ఉత్తమ నటుడిగా ఆమిర్‌కి జాతీయ అవార్డుకి ఎంపిక చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయం తాజాగా బాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం. 

శ్రీదేవి 300వందలకుపైగా చిత్రాల్లో, దాదాపు అన్ని భాషల్లో టాప్‌ స్టార్స్ తో కలిసి నటించింది. ఇంకా చెప్పాలంటే ఆమెతో స్టార్‌ హీరోలకు కలిసి నటించే అవకాశం లభించింది. కానీ ఆమిర్‌ మాత్రం ఆ ఛాన్స్ ని మిస్‌ చేసుకున్నాడు. అలా శ్రీదేవిని, ఆమిర్‌ని కలిసి తెరపై చూసే అదృష్టాన్ని ఆడియెన్స్ కోల్పోయారని చెప్పొచ్చు. 

ఆమిర్‌ ఖాన్‌ ఇటీవల తన భార్య కిరణ్‌రావు నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త బాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తామిద్దరం పరస్పర అంగీకారంతోనే, సంతోషంగా విడిపోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆమిర్‌ `లాల్‌సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కరీనా కపూర్‌ హీరోయిన్‌. టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు.  ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

click me!