66 ఏళ్ల వయసులో, 4వ పెళ్లి కి సై అంటున్న స్టార్ సింగర్ ఎవరు?

Published : Feb 24, 2025, 08:39 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు మూడు సార్లు పెళ్లిళ్లు కామన్. అయితే అది నటీనటుల మధ్యనే కాదు.. సింగర్స్ కూడా ఫాలో అవుతున్నారు. 66 ఏళ్లు వచ్చిన ఓ స్టార్ సింగర్ 4వసారి పెళ్లికి సిద్దం అయ్యాడు. ఇంతకీ ఎవరాయన.   

PREV
16
66 ఏళ్ల వయసులో, 4వ పెళ్లి కి సై అంటున్న స్టార్ సింగర్ ఎవరు?
Lucky Ali

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు పెళ్లిళ్లు చేసుకున్న యాక్టర్స్ చాలామంది ఉన్నారు. మూడు పెళ్లిళ్ళు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక రెండు పెళ్లిళ్ళు చేసుకున్నవారుఎంతో మంది ఉన్నారు. ఇలా  నటీనటులలో ఇది కామన్ అయిపోయింది. కాని సింగర్స్ లో కూడా ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్నవారు ఉన్నారని మీకు తెలుసా..? తాజాగా స్టార్ సీనియర్ సింగర్ ఒకరు నాలుగో సారి పెళ్లికి రెడీ అయ్యాడు. ఇంతకీ ఎవరా సింగర్. 

Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి

26
Lucky Ali

ఆయన ఎవరో కాదు ప్రముఖ గాయకుడు లక్కీ అలీ. ఈ స్టార్ సింగర్  66 ఏళ్ల వయసులో నాలుగో సారి పెళ్లి చేసుకోడానికి సిద్దం అయ్యాడు.  అంతే కాదు పబ్లిక్ గా తానకు పెళ్లి చేసుకోవాలని ఉందంటూ కోరికను వెల్లడించారు.

ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకుని విడాకులు తీసుకున్న అలీ. రీసెంట్ గా  ఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన 18వ కథాకరన్ అంతర్జాతీయ కథకుల ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్కీ అలీ తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. 

Also Read: చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక సాంగ్ ఏ సినిమాలో తెలుసా?

36
Lucky Ali

అంతే కాదు తన కెరీర్ గురించి తాను పాడిన  కొన్ని హిట్ సాంగ్స్ తో పాటు..వాటి బ్యాక్ గ్రౌండ్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ను గురించి వెల్లడించారు. ఈ లోపు  లక్కీ అలీని అతని తదుపరి కల గురించి అక్కడి వారు  అడిగినప్పుడు ఆయన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ‘మళ్ళీ పెళ్లి చేసుకోవాలనేది నా కల’ అంటూ నాలుగోసారి వివాహం చేసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేశారు లక్కీ ఆలీ. 

Also Read: విజయ్ దళపతి, సూర్య ఇద్దరు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?

46
Lucky Ali

ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ లో చర్చనీయాంశంగా మారింది. లక్కీ అలీ వ్యక్తిగత జీవితం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఆయన మూడు సార్లు పెళ్ళి చేసుకున్నాడు. ముగ్గురు భార్యలతో ఎక్కువ కాలు ఉండలేదు. వెంట వెంటనే వారితో విడాకులు అయ్యాయి. 

Also Read: సమంత ఆస్తి ఎన్ని కోట్లు, నెలకు ఆమె ఎంత సంపాదిస్తుందో తెలుసా?

56
Lucky Ali

లక్కీ అలీ మొదటి వివాహం ఆస్ట్రేలియాకుచెందిన మహిళతో జరిగింది.  ‘సునో’ ఆల్బమ్ సమయంలో వీరు కలుసుకున్నారు మనసులు కలిశాయి.  కానీ ఇద్దరి మధ్య సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.

చివరికి వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మొదటి భార్యతో విడాకుల తర్వాత లక్కీ అలీ 2000లో అనాహిత అనే పార్సీ మహిళను  పెళ్ళి చేసుకున్నారు. ఈ స్టార్ సింగర్ కోసం అనహిత మతం మార్చుకుని ఇనాయాగా పేరు మార్చుకుంది. 

Also Read: 2025లో రిలీజ్ కాబోతున్న 5 భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఇవే! ప్రభాస్ రాజా సాబ్ నుంచి టాక్సిక్ వరకు

66
Lucky Ali

రెండు భార్యతో కాస్త ఎక్కువ కాలం జీవించారు అలీ. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆతరువాత రెండవసారి విడాకులు తీసుకున్న తర్వాత, లక్కీ అలీ 2010లో కేట్ ఎలిజబెత్ హల్లమ్‌ను వివాహం చేసుకున్నాడు. లక్కీ అలీని వివాహం చేసుకున్న తర్వాత, ఆమె తన పేరును ఐషా అలీగా మార్చుకుంది.

లక్కీ అలీ మూడవ భార్య అతని కంటే 24 సంవత్సరాలు చిన్నది. అయితే వారు 2017 లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నుంచి ఒంటరిగా ఉంటున్న అలీ.. 66 ఏళ్ల వయస్సులో ఛాన్స్ వస్తే నాలుగో సారి పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories