Pawan kalyan: డాక్టర్స్ హెచ్చరించినా పవన్ కళ్యాణ్ వినలేదా, అందుకే ఈ సమస్య?

Published : Feb 24, 2025, 08:27 AM ISTUpdated : Feb 24, 2025, 08:29 AM IST

 Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరారు. సయాటికా నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు మరికొన్ని పరీక్షలు చేయాలని సూచించారు.

PREV
13
  Pawan kalyan: డాక్టర్స్ హెచ్చరించినా పవన్ కళ్యాణ్ వినలేదా, అందుకే ఈ సమస్య?
Doctors advised Pawan Kalyan to complete further tests by early March in telugu



 Pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపోలో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే.ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ శనివారం ( ఫిబ్రవరి 23, 2025 ) వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన ఫొటోలు అంతటా వైరల్ అవుతున్నాయి.

ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేసినట్లు సమాచారం. మరికొన్ని టెస్టులు అవసరమని డాక్టర్లు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు పవన్ కళ్యాణ్ కు ఏమైంది, ఎందుకు అపోలో లో చేరారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. డాక్టర్స్ గతంలోనే ఆయన్ను హెచ్చరించారని , అయితే ఆయన మొండిగా జనం కోసం ప్రతీ సారి  ముందుకు వెళ్తున్నారని, అందుకే ఈ ఆరోగ్య సమస్య అంటున్నారు. 

23
Doctors advised Pawan Kalyan to complete further tests by early March in telugu


అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సయాటికాతో బాధపడుతున్నారు. రీసెంట్ గా  తమిళనాడు కేరళలోని పుణ్యక్షేత్రాలు సందర్శించి, కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన పవన్ కళ్యాణ్ నడుం నొప్పి ఎక్కువవడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కొన్ని టెస్ట్ లు చేసిన అపోలో  ఫిబ్రవరి నెలాఖరులో కానీ..  మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన టెస్టులు చేయించుకోమన్నారని సమాచారం .
 

33
Doctors advised Pawan Kalyan to complete further tests by early March in telugu


పవన్ కళ్యాణ్    గత కొన్ని సంవత్సరాలుగా నడుం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు.  ఆయనకు ఎక్కువ ఫైట్స్, డాన్స్ స్టెప్స్ వేస్తే సమస్య మొదటికి వస్తుందని గతంలోనే హెచ్చరించారు. అయితే ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో తప్పటం లేదు. 

అలాగే రాజకీయాల్లోకి వచ్చాక మరింతగా శ్రమ పెరిగింది. దాంతో సమస్య మొదటికి వచ్చిందని చెప్తున్నారు.  దానికి తోడు ఆయన ఇటీవలే జ్వరం నుంచి కోలుకున్నారు.  ఇదిలా ఉండగా.. సోమవారం ( ఫిబ్రవరి 24 ) నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారని... జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ప్రకటించింది.
 

Read more Photos on
click me!

Recommended Stories