ముద్దు సన్నివేశాల్లో నటించాలని ఉంది, కానీ అందుకే ఆలస్యం.. రీతూ వర్మ కామెంట్స్

Published : Feb 24, 2025, 08:31 AM IST

టాలీవుడ్ లో గ్లామర్, నటనతో గుర్తింపు పొందిన హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు. గ్లామర్ కంటే రీతూ వర్మ నటన, ఎంచుకునే పాత్రలతోనే పాపులర్ అయ్యారు. ఆమెకి సక్సెస్ తక్కువగానే ఉంది. 

PREV
14
ముద్దు సన్నివేశాల్లో నటించాలని ఉంది, కానీ అందుకే ఆలస్యం.. రీతూ వర్మ కామెంట్స్
Ritu Varma

టాలీవుడ్ లో గ్లామర్, నటనతో గుర్తింపు పొందిన హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు. గ్లామర్ కంటే రీతూ వర్మ నటన, ఎంచుకునే పాత్రలతోనే పాపులర్ అయ్యారు. ఆమెకి సక్సెస్ తక్కువగానే ఉంది. కానీ ఎంచుకునే ప్రతి చిత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. పెళ్లి చూపులు చిత్రంతో రీతూ వర్మకి గుర్తింపు దక్కింది. 

 

24
Ritu Varma

రీతూ వర్మ ఒకే ఒక జీవితం, వరుడు కావలెను, స్వాగ్, మార్క్ ఆంటోని లాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె సందీప్ కిషన్ కి జంటగా నటిస్తున్న మజాకా చిత్రం శివరాత్రికి రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రీతూ వర్మ ప్రచార కారక్రమాలతో బిజీగా ఉంది. 

 

34
Mazaka

రీతూ వర్మ గ్లామర్ షో విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు. గ్లామర్ షో ఉన్న చిత్రాలు, రొమాంటిక్ సీన్లు, కిస్సింగ్ సన్నివేశాలు ఉన్న చిత్రాలకు రీతూ వర్మ దూరంగా ఉంటున్నారు. దీని గురించి తాజాగా రీతూ వర్మకి ప్రశ్న ఎదురైంది. రీతూ వర్మ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి. ముద్దు సన్నివేశాల్లో నటించనని నేను ఎప్పుడూ చెప్పలేదు. 

 

44
Mazaka

ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నన్ను చూసి ఆ అమ్మాయి ముద్దు సీన్లు చేయదని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే అలాంటి ఆఫర్ నాకు ఇంతవరకు రాలేదు. సందర్భం ప్రకారం అలాంటి సీన్ లో నటించాల్సి వస్తే తప్పకుండా నటిస్తా. ఆఫర్ రాకపోవడం వల్లే ఇన్ని రోజులు ఆలస్యం అయింది అని రీతూ వర్మ పేర్కొంది. మజాకా చిత్రంలో రీతూ వర్మ కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచినట్లు ఉంది. 

 

click me!

Recommended Stories