భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ బుధవారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మైదానంలో అతని ప్రదర్శనలు ఎంతగానో అభిమానులను ఆకట్టుకున్నా, అతని ఆస్తులు, జీవనశైలి ఇప్పుడు ప్రధానాంశంగా మారాయి. 2025 నాటికి చాహల్ నికర ఆస్తి రూ.45 కోట్లుగా అంచనా. ఇందులో అతని ఐపీఎల్ ఒప్పందం, బీసీసీఐ నుంచి వచ్చే ఆదాయాలు, బ్రాండ్ ప్రకటనలు, స్టార్టప్ పెట్టుబడులు కీలకంగా నిలిచాయి.
25
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌తో రూ.18 కోట్ల భారీ ఒప్పందం
2025 ఐపీఎల్ మేగా వేలంలో చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు దక్కించుకుంది. ఇది ఆయన్ని అత్యధిక పారితోషికం పొందిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిపింది. 2011 సీజన్‌లో ఐపీఎల్ లోకి ప్రవేశించిన చాహల్, ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా రూ.37.7 కోట్ల కంటే ఎక్కువ సంపాదించాడు.
35
విలాసవంతమైన నివాసం, విలువైన కార్లు కలిగిన చాహల్
యుజ్వేంద్ర చాహల్ గురుగ్రామ్‌లో ఉన్న రూ.25 కోట్ల విలువైన ఇంటిలో నివసిస్తున్నాడు. ఈ ఇల్లు ఆధునిక ఇంటీరియర్ డిజైన్, కళాత్మక డెకార్‌తో ప్రత్యేకంగా ఉంది. అతని కార్ల సేకరణలో పోర్ష్ కయేన్ S, మెర్సిడెస్ బెంజ్ C-క్లాస్, రోల్స్ రాయిస్, లంబోర్గినీ సెంటెనారియో ఉన్నాయి. వీటి విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో మూడు సంవత్సరాల వివాహం అనంతరం ఫిబ్రవరి 20, 2025న ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. విడాకుల నేపథ్యంలో ఆమె రూ.60 కోట్ల అలిమనీ డిమాండ్ చేసిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఆమె న్యాయవాది ఈ వార్తలను పూర్తిగా తిప్పికొట్టారు. అలిమనీ ద్వారా ఆమె ఆస్తి మూడు రెట్లు పెరుగుతుందన్న వార్తలు నిజం లేదని పేర్కొన్నారు. అయితే, చాహల్ ధనశ్రీకి భారీగానే భరణం ఇచ్చారని రిపోర్టులు పేర్కొన్నాయి.
55
భారత జట్టులో స్థానం కోల్పోయిన యుజ్వేంద్ర చాహల్
2023-24 బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో యుజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కలేదు. దీనివల్ల ఆయనకు రూ.1 కోట్ల పేమెంట్ అందలేదు. అయినప్పటికీ, ఆయన ఇంకా 2018 నుండి ఆదాయపు పన్ను అధికారిగా ప్రభుత్వ జీతం పొందుతున్నాడు. ఇది నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకూ ఉంటుంది. అంతేకాకుండా, చెక్‌మేట్ అనే లైఫ్‌స్టైల్ బ్రాండ్, గ్రిప్ అనే ఫిట్‌నెస్ యాప్, యుజో అనే ఫ్యాషన్ బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టాడు.
చాహల్ ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా 2024లో చరిత్ర సృష్టించాడు. ఇతని వ్యాపార మేధస్సు, క్రికెట్ ప్రతిభ, పెట్టుబడులు అతన్ని భారత క్రికెట్ లో సంపన్న ప్లేయర్ గా నిలబెట్టాయి.