Yashasvi Jaiswal: భారత జట్టు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ పై మరో సెంచరీ కొట్టాడు. అలాగే, లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు.
టీమిండియాలో సీనియర్ ప్లేయర్లు విఫలమైన సమయంలో అద్భుతమైన బ్యాటింగ్ తో జైస్ బాల్ రుచిని చూపించాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను భారత వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ తన శైలిలో దూకుడుగా ఆడుతూ సెంచరీ కొట్టాడు.
25
వరుస సిక్సర్లతో ఇంగ్లాండ్ పై సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్
ఓవల్ మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత జట్టు 189/3 వద్ద లంచ్‌కు వెళ్లగా, జైస్వాల్ అజేయంగా 85 పరుగులతో నిలిచాడు. ఆ తర్వాత అద్భుతమైన బ్యాటింగ్ తో వరుస సిక్సర్లు బాది కేవలం 127 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తన సెంచరీ నాక్ లో 13 బౌండరీలు, రెండు సిక్సర్లు బాదాడు.
జైస్వాల్ కు టెస్ట్‌ల్లో ఇది 6వ సెంచరీ. అలాగే, ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తంగా తొమ్మిది 50+ స్కోర్లు నమోదు చేశాడు.
ఇది 23 ఏళ్ల వయస్సులో ఇంగ్లాండ్‌పై అత్యధిక 50+ స్కోర్లు సాధించిన భారత ఆటగాడిగా యశస్వి జైస్వాల్ ను నిలబెట్టింది. ఇదివరకు ఈ ఘనత సచిన్ టెండూల్కర్ (14 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు 50+ పరుగులు) పేరిట ఉంది.
35
ఓవల్ యశస్వి జైస్వాల్ సిక్సర్ల రికార్డు
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో జైస్వాల్ మరో రికార్డు దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై టెస్ట్‌లలో 30 సిక్సర్లు బాదిన జైస్వాల్.. వివ్ రిచర్డ్స్ 34 సిక్సర్ల రికార్డును అధిగమించేందుకు కేవలం ఐదు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు (38) రిషబ్ పంత్ పేరిట ఉన్నాయి.
ఆకాశ్ దీప్ తో కలిసి భారత్ కు సెంచరీ భాగస్వామ్యం
మూడో రోజు ఉదయం సెషన్‌లో నైట్‌వాచ్‌మ్యాన్‌గా వచ్చిన ఆకాష్ దీప్ 94 బంతుల్లో 66 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్నాడు.
తన టెస్ట్ కెరీర్‌లో ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరో ఎండ్ లో జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో మెరిశాడు. ఆకాశ్ దీప్, జైస్వాల్ కలిసి 107 పరుగుల భాగస్వామ్యంతో టీమ్ ఇండియాను మంచి ఆధిక్యం దిశగా ముందుకు తీసుకెళ్లారు.
55
భారీ ఆధిక్యం దిశగా భారత్
లంచ్ విరామానికి ముందు చివరి ఓవర్‌లో జైస్వాల్ పరుగు తీసే సమయంలో కొంత మోకాలి నొప్పితో కనిపించాడు. దీంతో కొంత ఆలస్యం చేయడంపై ఇంగ్లాండ్ ఆటగాళ్ల జాక్ క్రాలీ, ఓలీ పోప్ అతనితో వాగ్వాదం చేశారు. మూడో టెస్ట్ నుంచి ఇలా ఇంగ్లాండ్, భారత్ ప్లేయర్ల మధ్య గ్రౌండ్ హాట్ ఫైట్ కొనసాగుతోంది.
ఈరోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో భారత బ్యాటర్లు మరింత ధైర్యంగా ఆడుతున్నారు. జైస్వాల్ 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 278-6 (67 Ov) పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.