Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్‌

Published : Aug 01, 2025, 11:58 PM IST

Joe Root: జో రూట్‌ ఇండియాపై ఇంగ్లాండ్‌లో టెస్ట్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. అలాగే, ఓవల్ టెస్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.

PREV
15
ఓవల్ టెస్టులో జో రూట్ కొత్త మైలురాయి

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ తన అద్భుతమైన టెస్ట్ కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. ది ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ రెండో రోజు భారత్‌పై 29 పరుగులు చేసిన రూట్, సచిన్ టెండూల్కర్ హోం టెస్ట్ పరుగుల రికార్డును అధిగమించాడు. 

ఈ ఇన్నింగ్స్ తో కలిపి జో రూట్‌ ఇంగ్లాండ్‌లో మొత్తం 7,220 పరుగులు పూర్తి చేశాడు. హోం టెస్టుల్లో సచిన్ టెండూల్కర్‌ భారత్‌లో 7,216 పరుగులు చేశాడు.

DID YOU KNOW ?
టెస్టు క్రికెట్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ (భారత్) 51 సెంచరీలు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో జాక్వెస్ కల్లిస్ (సౌత్ ఆఫ్రికా) 45 సెంచరీలు, రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 41 సెంచరీలు, కుమార్ సంగక్కర (శ్రీలంక) 38 సెంచరీలతో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్ లో యాక్టివ్ గా ఉన్న జో రూట్ (ఇంగ్లాండ్) 38 సెంచరీలు బాదాడు.
25
హోం టెస్ట్‌లలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు
  1. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 7,578
  2. జో రూట్ (ఇంగ్లాండ్): 7,220*
  3. సచిన్ టెండూల్కర్ (భారత్): 7,216
  4. మహేల జయవర్ధనే (శ్రీలంక): 7,167
  5. జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా): 7,035

హోం టెస్ట్‌లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా జో రూట్ కొనసాగుతున్నాడు. ఈ రికార్డుతో సచిన్‌ను అధిగమించాడు.

35
భారతదేశంపై ఇంగ్లాండ్‌లో 2000 పరుగులు చేసిన జో రూట్

జో రూట్ భారతదేశంపై ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేసిన అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటివరకు ఈ ఘనతను డాన్ బ్రాడ్‌మాన్ (ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియాలో 2,354 పరుగులు) మాత్రమే సాధించారు. జో రూట్ ఇప్పుడు ఆ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.

భారతదేశంపై ఒక దేశంలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు

  1. జో రూట్ (ఇంగ్లాండ్): 2000*
  2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 1,893
  3. శివనారైన్ చంద్రపాల్ (వెస్టిండీస్): 1,547
  4. జహీర్ అబ్బాస్ (పాకిస్తాన్): 1,427
  5. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా): 1,396
45
కుమార సంగక్కరను అధిగమించిన జో రూట్

ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన జో రూట్.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించాడు. భారత్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో మూడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

ప్రస్తుతం రూట్ 4,290 పరుగులతో ఉన్నాడు. కుమార సంగక్కర 4,287 పరుగులు చేశాడు. రికీ పాంటింగ్ (4,795), మహేల జయవర్ధనే (4,563)లు మాత్రమే అతని కంటే ముందు ఉన్నారు.

55
ఓవల్ లో మూడో రోజు భారత్ కు కీలకం

ఈ టెస్ట్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 224 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్ గస్ అట్కిన్‌సన్ ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్ సిరాజ్, ప్రిసిద్ధ్ క్రిష్ణలు చెరో 4 వికెట్లు పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్ ను భారత్ దూకుడుగా మొదలుపెట్టింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సునామీ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. 44 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులతో రెండో రోజును ముగించింది. మూడో రోజు మొత్తం భారత్ ఆడితే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories