IND vs ENG: ఓవల్ లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మాస్ ! ఇంగ్లాండ్ కు దిమ్మదిరిగేలా బదులిచ్చిన టీమిండియా

Published : Aug 01, 2025, 11:44 PM IST

India vs England: ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 247 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టారు.

PREV
15
ఓవల్ లో 247 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్

ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ లండన్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 224 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

కరుణ్ నాయర్ అర్ధ సెంచరీ (57 పరుగులు)తో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్ గుస్ అట్కిన్సన్ 5 వికెట్లు తీసుకున్నాడు. జోష్ టంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 247 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

DID YOU KNOW ?
ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్లు
సునీల్ గవాస్కర్ (1979) 542 పరుగులు, కేఎల్ రాహుల్ (2025) 532 పరుగులు, మురళీ విజయ్ (2014) 402 పరుగులు, రోహిత్ శర్మ (2021-22) 368 పరుగులు
25
సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్

ఇంగ్లాండ్ జట్టు మొదటి వికెట్ కు 92 పరుగులు జోడించింది. బెన్ డకెట్ 38 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జాక్ క్రాలీ (57 బంతుల్లో 64 పరుగులు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత పూర్తిగా మ్యాచ్ మలుపు తిరిగింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ చేరారు.

ఇంగ్లాండ్ ఆలౌట్

ఆలీ పోప్ (22), జో రూట్ (29) త్వరగానే అవుట్ అయ్యారు. చివర్లో జాకబ్ బెథెల్ (6), జేమీ స్మిత్ (8), ఓవర్టన్ (11) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. సూపర్ అర్ధ సెంచరీతో రాణించిన హ్యారీ బ్రూక్ 53 పరుగులకు అవుట్ అయ్యాడు.

క్రిస్ వోక్స్ గాయం కారణంగా వైదొలగడంతో ఇంగ్లాండ్ 247/9 వద్ద వారి ఇన్నింగ్స్ ముగిసింది. ఇండియా తరపున మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 4 వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

35
200 వికెట్లు తీసిన సిరాజ్

అన్ని ఫార్మాట్ లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్ లో మహమ్మద్ సిరాజ్ 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఐదో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా సిరాజ్ ఈ మైలురాయిని అందుకున్నాడు. 

సిరాజ్ 101 మ్యాచ్ లలో 29.06 సగటు, 4.11 ఎకానమీతో 202 వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాపై 6/15 అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.

45
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఐదు మ్యాచ్ లలో 37.17 సగటు, 4.13 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. 

6/70 అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. 5వ టెస్ట్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోప్, నెంబర్ 1 టెస్ట్ బ్యాట్స్ మెన్ జో రూట్, జాకబ్ బెథెల్ లను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపించాడు.

55
రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ దూకుడు

రెండో ఇన్నింగ్స్ టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపాడు. అదరిపోయే షాట్స్ తో రెండో ఇన్నింగ్స్ లో భారత్ కు శుభారంభం అందించాడు. కేవలం 44 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 

మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 7 పరుగుల వద్ద జోష్ టంగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 

Read more Photos on
click me!

Recommended Stories