ఆసియా కప్ 2025: శ్రేయస్ అయ్యర్‌ను భారత జట్టు నుంచి ఎందుకు తప్పించారు?

Published : Aug 19, 2025, 05:31 PM ISTUpdated : Aug 19, 2025, 06:01 PM IST

Shreyas Iyer: ఆసియా కప్ 2025 జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం జట్టును ప్రకటించారు. అయితే, అద్భుతమైన ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు?

PREV
15
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు

ముంబైలో మంగళవారం భారత క్రికెట్ నియామక కమిటీ (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ 2025 జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబి వేదికలుగా జరగనున్న ఈ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొనబోతోంది. 

కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నియమితులయ్యారు. అయితే, ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ కు భారత జట్టులో స్థానం లభించలేదు. జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు స్థానం లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

DID YOU KNOW ?
ఐపీఎల్ లో శ్రేయాస్ అయ్యర్ రికార్డు
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను (ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్) ఫైనల్‌కు నడిపించిన తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు.
25
శ్రేయస్ అయ్యర్ ను భారత జట్టు నుంచి ఎందుకు తప్పించారు?

భారత జట్టులోకి శ్రేయాస్ అయ్యర్ తీసుకోకపోవడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్, భారత జట్టు తరఫును అద్భుతమైన ఇన్నింగ్స్ లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 

ఐపీఎల్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు. అయ్యర్ ను భారత జట్టులోకి తీసుకోకపోవడం గురించి బీసీసీఐ చీఫ్ స్పందించారు.

అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "శ్రేయస్‌ విషయంలో ఆయన ఎవరిని రీప్లేస్ చేయగలడో మీరే చెప్పాలి. ఇది ఆయన తప్పు కాదు, మాది కూడా కాదు. మాకు 15 మందిని మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆయన తన అవకాశం కోసం వేచి ఉండాలి" అని అన్నారు.

భారత టీ20 జట్టులో శ్రేయాస్ అయ్యర్ సాధారణ బ్యాటింగ్ స్థానాలు గమనిస్తే.. ఎక్కువగా నంబర్ 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ చేశారు. 2017లో భారత్ తరఫున టీ20 ఆరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రధానంగా నంబర్ 4 లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. కొన్ని మ్యాచ్‌ల్లో నంబర్ 3 లోనూ, ప్రత్యేక పరిస్థితుల్లో నంబర్ 5 లేదా 6 లోనూ బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం జట్టులోకి శుభ్ మన్ గిల్ వచ్చాడు. అలాగే, తిలక్ వర్మ కూడా జట్టులో ఉన్నాడు. వీరిద్దరూ కూడా మూడో స్థానం కోసం పోటీలో ఉన్నారు. కాబట్టి అయ్యర్ కు జట్టులో స్థానం లభించలేదు.

4వ స్థానంలో విషయానికి వస్తే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. 5వ స్థాన కోసం రింకూ సింగ్, శివం దూబేలు ఉన్నారు.

ఇదే సమయంలో యశస్వి జైస్వాల్‌ను కూడా ప్రధాన జట్టులో కాకుండా స్టాండ్‌బై జాబితాలో ఉంచారు. ఇక శ్రేయస్ పూర్తిగా జట్టులో లేకపోవడం అభిమానుల్లో అసంతృప్తి రేకెత్తించింది.

35
శ్రేయస్ అయ్యర్ ఫామ్, రికార్డులు

శ్రేయస్ అయ్యర్ చివరి సారిగా డిసెంబర్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆయన హాఫ్ సెంచరీ సాధించాడు. 2024లో ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా ట్రోఫీ అందించాడు. 

2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కి తీసుకెళ్లాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆయన 17 మ్యాచ్‌లలో 604 పరుగులు చేశారు. స్ట్రైక్‌రేట్ 175.07, సగటు 50.33గా ఉండటం విశేషం. ఆరు హాఫ్ సెంచరీలు సాధించారు. అయినప్పటికీ ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కలేదు.

అలాగే ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. 5 ఇన్నింగ్స్‌లో 243 పరుగులు చేసి, భారత జట్టులో టాప్ స్కోరర్‌గా కూడా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.

45
భారత జట్టు వైస్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, “ఇంగ్లాండ్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. మేము ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. అందుకే ఆయన్ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశాం” అని తెలిపారు.

గిల్ చివరిసారిగా 2024లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. ఈ సారి అతనికి అక్షర్ పటేల్ స్థానంలో ఆయనకు అవకాశం లభించింది.

55
ఆసియా కప్ 2025 భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్,  జితేష్ శర్మ (వికెట్ కీపర్),  హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఆసియా కప్ 2025 లో భారత్ మ్యాచ్‌లు

• సెప్టెంబర్ 10: భారత్ vs UAE (దుబాయ్)

• సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్)

• సెప్టెంబర్ 19: భారత్ vs ఒమాన్ (అబుదాబి)

అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్‌కు ఈసారి ఆసియా కప్ జట్టులో అవకాశం రాలేదు. అగార్కర్ స్పష్టంగా "ఇది ఎవరి తప్పు కాదు" అని వ్యాఖ్యానించారు. అయితే అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బీసీసీఐపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories