ఆసియా కప్ 2025: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. సూర్యకుమార్ కెప్టెన్సీలో గిల్ కు చోటు

Published : Aug 19, 2025, 03:48 PM IST

India squad for Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. యశస్వి జైస్వాల్ కు చోటు దక్కలేదు.

PREV
16
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో గిల్ కు చోటు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. మంగళవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం వెల్లడించారు. ఈసారి జట్టులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.

DID YOU KNOW ?
ఆసియా కప్ 2025
ఆసియా కప్ 2025ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపులుగా జట్లను విభజించారు. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి.
26
యశస్వి జైస్వాల్ కు దక్కని చోటు

జట్టులో చోటు దక్కకపోవడం వల్ల ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయనను 15 మంది ప్రధాన జట్టులో కాకుండా స్టాండ్ బై జాబితాలో ఉంచారు. ఆయనతో పాటు రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ కూడా స్టాండ్ బైలో ఉన్నారు. అయితే, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రధాన జట్టులోనే కాకుండా స్టాండ్ బైలో కూడా అవకాశం ఇవ్వలేదు.

36
శ్రేయస్ అయ్యర్ కు బిగ్ షాక్

శ్రేయస్ అయ్యర్ కు జట్టులో చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత రెండు సీజన్లలో ఆయన మెరుగైన ఫామ్‌లో ఉండగా, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున 600 పరుగులు చేసి స్ట్రైక్ రేట్ 175.07 సాధించారు. ఇది 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. “అయ్యర్ తప్పు ఏమీ కాదు. కానీ ఆయన స్థానంలో ఎవరిని తొలగించాలి? ఆయనకి అవకాశం రావాల్సిందే కానీ ఇప్పుడే కాదని నిర్ణయించాం” అని చెప్పారు.

46
భారత జట్టులో కొత్తవారికి అవకాశాలు

భారత జట్టులో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. సంజూ, జితేష్ శర్మ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రధాన ఫాస్ట్ బౌలర్లు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఆల్‌రౌండర్లుగా పేస్ ఆప్షన్లుగా ఉన్నారు.

56
ఆసియా కప్ 2025 ఎప్పుడు ప్రారంభం కానుంది?

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడనుంది. ఈ టోర్నమెంట్ ద్వారా 2026 ఫిబ్రవరిలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు సన్నద్ధం కానుంది.

66
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

స్టాండ్ బై ఆటగాళ్లు (5 మంది)

ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్

Read more Photos on
click me!

Recommended Stories