ఆసియా కప్ 2025లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.
గ్రూప్ దశలో టాప్ 2 జట్లు సూపర్ ఫోర్ కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 22న అబుదాబిలో ఒక సూపర్ ఫోర్స్ మ్యాచ్ జరగనుండగా, మిగిలిన పోటీలు, ఫైనల్ దుబాయ్‌లో జరుగుతాయి.
ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టు ఇదే
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ జట్టులో లేరు. సల్మాన్ అలీ అఘాను కెప్టెన్‌గా నియమించారు. జట్టులో షాహీన్ అఫ్రిదీ, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఆసియా కప్ 2025 కోసం భారత్ జట్టును ఆగస్టు 19న ప్రకటించే అవకాశం ఉంది.