కోహ్లీ, రోహిత్, పుజారా లకు సచిన్‌ లాంటి అదృష్టం లేదు !

Published : Aug 30, 2025, 05:55 PM IST

Team india farewell: అద్భుతమైన ఆటతో పాటు టీమిండియాకు అనేక విజయాలు అందించిన వారు చాలా మంది ఉన్నారు. ఈ కోవకు చెందిన కోహ్లీ, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా లాంటి స్టార్ ప్లేయర్లకు సచిన్ టెండూల్కర్ కు లభించిన అదృష్టం లేదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్.. క్రికెట్ ప్రపంచాన్ని కదిలించిన క్షణం

2013 నవంబర్ 16.. ఆ రోజు భారత క్రికెట్ చరిత్రలోనే కాదు యావత్ క్రీడాలోకం ఎప్పటికీ మరువలేనిది. ముంబై వాంఖడే స్టేడియంలో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ ఆడి, కన్నీరు పెట్టేలా చేసిన వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు. 16 ఏళ్ల వయసులో భారత జట్టులోకి వచ్చిన సచిన్.. రెండున్నర దశాబ్దాలపాటు దేశ క్రికెట్‌ను భుజస్కంధాలపై మోశారు.

ఆఖరి మ్యాచ్‌లో వేదికపై నిలబడి, హృదయాన్ని తాకే మాటలతో ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఘనత, ఆ గౌరవం ప్రతి ఆటగాడు కోరుకుంటారు.

DID YOU KNOW ?
విరాట్, రోహిత్ రిటైర్మెంట్
టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు క్రికెట్, టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వారు వన్డే క్రికెట్ లోనే కొనసాగుతున్నారు. రాబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.
25
సచిన్ తర్వాత ఎవరికీ అలాంటి గౌరవం రాలేదు !

సచిన్ తరువాత రిటైర్ అయిన లెజెండ్స్ జాబితా చాలా పెద్దగానే ఉంది. "వెరీ వెరీ స్పెషల్" వీవీఎస్ లక్ష్మణ్, అగ్రెసివ్ బ్యాటింగ్‌తో అలరించిన వీరేంద్ర సెహ్వాగ్, క్యాన్సర్‌ను జయించి ప్రపంచకప్ గెలిపించిన యువరాజ్ సింగ్, పేస్ దాడికి నాయకుడిగా నిలిచిన జహీర్ ఖాన్, ఓపెనర్‌గా రాణించిన గౌతమ్ గంభీర్, కోల్‌కతాలో ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన హర్భజన్ సింగ్… ఇలా చాలా మందే ఉన్నారు. వీరందరికీ సచిన్ లా సరైన వీడ్కోలు లభించలేదు. 

35
ధోనీ, రైనాలకు కూడా..

2020 ఆగస్టు 15న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ వెంటనే సురేశ్ రైనా కూడా అంతే నిశ్శబ్దంగా తన క్రికెట్ ప్రస్థానం ముగించారు. భారత క్రికెట్‌కు ఎంతో సేవలందించిన ఈ ఇద్దరికీ కూడా సచిన్‌లాంటి ఘనమైన వీడ్కోలు లభించలేదు. ఆ తర్వాత గబ్బర్ శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇటీవలే రిటైర్ అయిన ఛెతేశ్వర్ పుజారా కూడా అదే జాబితాలో చేరారు.

45
ప్రతిభావంతులు కానీ గుర్తింపు తక్కువ

బీసీసీఐ నిర్ణయాలు, ఆటగాళ్ల ఫాం, గాయాలు.. ఇవన్నీ కలిసి చాలా మంది కెరీర్‌ను ముగించాయని చెప్పవచ్చు. మొదట జట్టులో చోటు కోల్పోయి, తిరిగి రావడానికి అవకాశమే లేకపోవడంతో తర్వాత నిశ్శబ్దంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ క్రమంలోనే పుజారా పేరు కూడా చేరింది. సచిన్ తరువాత భారత క్రికెట్‌కు ముఖచిత్రాలుగా నిలిచిన కోహ్లీ, రోహిత్‌ కూడా వారి స్టార్ డమ్ కు, భారత జట్టుకు చేసిన సేవలకు తగిన ఘనమైన వీడ్కోలు పొందలేదు.

55
ఇంకా ఎవరెవరు క్యూలో ఉన్నారు?

రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్న ఆటగాళ్ల జాబితా కూడా పెద్దగానే ఉంది. ఆస్ట్రేలియాలో అద్భుత విజయం సాధించినప్పుడు భారత జట్టుకు నాయకత్వం వహించిన అజింక్య రహానే, పేస్ బౌలింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, స్పిన్ బౌలింగ్‌లో తనదైన ముద్రవేసిన యుజ్వేంద్ర చాహల్.. ఇలా చాలా మందే లిస్టులో ఉన్నారు. భవిష్యత్తులో వారందరికీ కూడా సచిన్ స్థాయి వీడ్కోలు లభించకపోవచ్చని అంచనా.

మొత్తంగా చూస్తే, సచిన్ టెండూల్కర్‌లాంటి ఘనమైన వీడ్కోలు భారత క్రికెట్‌లో మరెవరికీ దక్కలేదు. కోహ్లీ, రోహిత్, పుజారా వంటి మహా క్రికెటర్లకు కూడా అది లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. సచిన్ లాంటి స్థాయిలో లేకపోయిన క్రికెట్ లో తమదైన ముద్రవేసిన కోహ్లీ, విరాట్ లకు కూడా వీడ్కోలు మ్యాచ్ లు లేకపోవడంపై అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories