
2025 క్రికెట్ లవర్స్ కి బ్యాడ్ ఇయర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లోని క్రికెట్ టీమ్ లలో ప్రధాన ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇందులో ఎక్కువ మంది భారతీయ ప్లేయర్స్ కావడం గమనార్హం. ఇంతకీ ఏ దేశంలో ఏ ప్లేయర్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు పదవి విరమణ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్టిన్ గప్టిల్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
జనవరి 8, 2025న న్యూజిలాండ్ పవర్‌హిట్టర్ మార్టిన్ గప్టిల్ అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల కెరీర్‌లో 47 టెస్టులు, 198 వన్డేలు, 122 T20లు ఆడారు.
తమీమ్ ఇక్బాల్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
తమీమ్ ఇక్బాల్ జనవరిలోనే అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు. ఇంతకుముందు 2023లో కూడా రిటైర్ అయ్యారు కానీ ఆ దేశ ప్రధాని అభ్యర్థనపై తిరిగి వచ్చారు.
ముష్ఫికూర్ రహీమ్ – వన్డేలకు గుడ్‌బై
2025 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మార్చి 5న రహీమ్ వన్డేలకు రిటైర్ అయ్యారు. 274 వన్డేల్లో 7795 పరుగులు సాధించారు.
వరుణ్ ఆరన్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
జనవరి 10న వరుణ్ ఆరన్ క్రికెట్ మొత్తానికి వీడ్కోలు పలికారు. 18 మ్యాచ్‌లలో 29 వికెట్లు తీశారు.
రిద్దిమాన్ సాహా – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
ఫిబ్రవరి 3న సాహా రిటైర్ అయ్యారు. 40 టెస్టుల్లో 1353 పరుగులు, 9 వన్డేల్లో 41 పరుగులు చేశారు.
రోహిత్ శర్మ – టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 67 టెస్టుల్లో 4301 పరుగులు, 12 శతకాలు, ఒక డబుల్ సెంచరీ చేశారు.
విరాట్ కోహ్లీ – టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్
మే 12, 2025న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశారు.
పీయూష్ చావ్లా – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
జూన్ 6న చావ్లా రిటైర్ అయ్యారు. కెరీర్‌లో మొత్తం 82 వికెట్లు తీశారు.
చేతేశ్వర్ పూజారా – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
ఆగస్టు 24న పూజారా రిటైర్ అయ్యారు. 103 టెస్టుల్లో 7195 పరుగులు చేశారు. ఇందులో 19 శతకాలు, 35 అర్ధశతకాలు ఉన్నాయి.
రవిచంద్రన్ అశ్విన్ – IPL నుంచి రిటైర్
ఆగస్టు 27, 2025న అశ్విన్ IPL నుంచి రిటైర్ అయ్యారు. 187 వికెట్లు తీసుకున్నారు. ఇంతకు ముందు డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పారు.
షాపూర్ జద్రాన్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
జనవరిలో షాపూర్ జద్రాన్ సోషల్ మీడియాలో రిటైర్‌మెంట్ ప్రకటించారు.
దిముత్ కరుణారత్నె – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
ఫిబ్రవరి 4న ఆస్ట్రేలియాతో 100వ టెస్ట్ ఆడిన తర్వాత కరుణారత్నె రిటైర్ అయ్యారు.
అంజెలో మాథ్యూస్ – టెస్టులకు గుడ్‌బై
జూన్‌లో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. 119 టెస్టుల్లో 8214 పరుగులు చేశారు.
మార్కస్ స్టోయినిస్ – వన్డేలకు రిటైర్
ఫిబ్రవరి 6న స్టోయినిస్ వన్డేల నుంచి రిటైర్ అయ్యారు. 71 మ్యాచ్‌లలో 1495 పరుగులు చేశారు.
స్టీవ్ స్మిత్ – వన్డేలకు గుడ్‌బై
మార్చిలో స్మిత్ వన్డేల నుంచి రిటైర్ అయ్యారు. 170 మ్యాచ్‌లలో 5800 పరుగులు చేశారు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ – వన్డేలకు రిటైర్
జూన్‌లో మ్యాక్స్‌వెల్ వన్డేల నుంచి రిటైర్ అయ్యారు. 149 మ్యాచ్‌లలో 3990 పరుగులు చేశారు.
హెన్రిక్ క్లాసెన్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
జూన్ 2న క్లాసెన్ రిటైర్ అయ్యారు. 4 టెస్టులు, 60 వన్డేలు, 58 T20లు ఆడారు.
నికోలస్ పూరన్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
జూన్ 9న పూరన్ రిటైర్ అయ్యారు. 61 వన్డేల్లో 1983 పరుగులు, 106 T20ల్లో 2275 పరుగులు చేశారు.
ఆండ్రే రస్సెల్ – అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్
జూలైలో రస్సెల్ రిటైర్ అయ్యారు. 1 టెస్ట్, 56 వన్డేలు, 84 T20లు ఆడారు.