నేషనల్ స్పోర్ట్స్ డే: సచిన్ నుంచి మిథాలీ రాజ్ వరకు.. ఖేల్‌రత్న పొందిన ఐదుగురు క్రికెట్ దిగ్గజాలు

Published : Aug 29, 2025, 03:06 PM IST

National Sports Day : మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు భారతదేశంలో క్రీడల రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు గెలుచుకున్న ఐదుగురు భారత క్రికెట్ లెజెండ్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు

మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు భారతదేశంలో అత్యున్నత క్రీడా గౌరవంగా పరిగణిస్తారు. దీనిని అంతకుముందు, రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు పేరుతో పిలిచేవారు. తర్వాత హాకీ దిగ్గజం మెజర్ ధ్యాన్‌చంద్ పేరుతో మార్చారు. దేశంలో ఆయనను ఇప్పటివరకు అత్యుత్తమ హాకీ ఆటగాడిగా భావిస్తారు. ఈ అవార్డు ప్రతి సంవత్సరం యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా క్రీడల్లో విశేష ప్రతిభ చూపిన ఆటగాళ్లకు ప్రదానం చేస్తారు.

DID YOU KNOW ?
ఖేల్‌రత్న
2021 ఆగస్టులో భారత ప్రభుత్వం ఈ అవార్డు పేరును రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం నుండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చింది. ఈ మార్పు భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గౌరవార్థం తీసుకున్నారు.
25
మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు ఎంపిక విధానం

విజేతలను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక చేస్తుంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు ను ఇస్తారు. ఇందులో 25 లక్షల రూపాయల నగదు, ఒక మెడల్, సర్టిఫికేట్ లభిస్తాయి.

35
మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న ప్రత్యేక రికార్డులు

చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 1991–92లో ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు. షూటర్ అభినవ్ బింద్రా 2001లో కేవలం 18 ఏళ్ల వయసులోనే ఈ అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఒక ఆటగాడికే ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మినహాయింపులు జరిగాయి. 

2024లో నలుగురు ఆటగాళ్లకు మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు ప్రదానం చేశారు. చెస్‌లో డి. గుకేశ్, షూటింగ్‌లో మను భాకర్, హాకీలో హర్మన్‌ప్రీత్ సింగ్, పారా-అథ్లెటిక్స్‌లో ప్రవీణ్ కుమార్ లు ఈ గౌరవాన్ని అందుకున్నారు.

45
మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు ఇవ్వని సందర్భాలు ఉన్నాయి

2008, 2014 సంవత్సరాల్లో ఏ ఆటగాడికీ మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును ఇవ్వలేదు. 2024 వరకు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిల్లియర్డ్స్, బాక్సింగ్, చెస్, క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, పారా-అథ్లెటిక్స్, పారా-బ్యాడ్మింటన్, పారా-షూటింగ్, షూటింగ్, స్నూకర్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రోవింగ్ వంటి 16 క్రీడా విభాగాల్లో 62 మంది ఆటగాళ్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు.

55
మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు గెలుచుకున్న క్రికెట్ లెజెండ్స్

భారత క్రికెట్‌లో పలువురు ప్లేయర్లు మెజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న గౌరవాన్ని పొందారు. వారిలో..

• సచిన్ టెండూల్కర్ – 1997–1998

• మహేంద్ర సింగ్ ధోనీ – 2007

• విరాట్ కోహ్లీ – 2018

• రోహిత్ శర్మ – 2020

• మిథాలీ రాజ్ – 2021

ఈ జాబితాలో మిథాలీ రాజ్ మాత్రమే మహిళా క్రికెటర్‌గా నిలిచారు.

Read more Photos on
click me!

Recommended Stories