Virat Kohli, Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారత్ కు ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే, కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్‌కప్ భారత జట్టు ప్లాన్ లో లేరని సెలెక్టర్లు సంకేతాలు పంపుతున్నారు.
రిటైర్మెంట్ తర్వాత వన్డేలపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫోకస్
భారత్ క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్, టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే, వన్డే ఫార్మాట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అభిమానులు వీరిని మళ్లీ మైదానంలో చూడాలంటే అక్టోబర్ వరకు వేచి చూడాలి.
ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరగాల్సిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పరస్పర అంగీకారంతో సెప్టెంబర్ 2026కి వాయిదా వేశారు. కాగా, ప్రస్తుతం రిపోర్టుల ప్రకారం.. ఈ సీనియర్ స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్ తగిలిందని సమాచారం.
DID YOU KNOW ?
టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్
టీ20 వరల్డ్ కప్ 2024 ను భారత్ గెలుచుకుంది. బార్బాడోస్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్ ఫైనల్‌లో 176/7 పరుగులు చేసింది భారత్. సౌతాఫ్రికా 169/8 (20 ఓవర్స్) పరుగులు మాత్రమే చేసి 7 తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ సమయంలోనే కోహ్లీ, రోహిత్ లు రిటైర్మెంట్ ప్రకటించారు.
25
ఆస్ట్రేలియా టూర్.. కోహ్లీ, రోహిత్ లకు చివరి వన్డే సిరీస్ అవుతుందా?
రోహిత్, విరాట్ ఇప్పుడు నేరుగా అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నారు. సిరీస్ షెడ్యూల్ గమనిస్తే..
1వ వన్డే: అక్టోబర్ 19 – పెర్త్ స్టేడియం
2వ వన్డే: అక్టోబర్ 23 – అడిలైడ్
3వ వన్డే: అక్టోబర్ 25 – సిడ్నీ
ప్రస్తుతం వెలువడుతున్న మీడియా రిపోర్టులు, క్రికెట్ సర్కింట్ లో సాగుతున్న టాక్ ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సెలెక్టర్స్ 2027 వన్డే వరల్డ్‌కప్ ప్లాన్‌లో చూడటం లేదు.
35
కోహ్లీ, రోహిత్ లకు బీసీసీఐ కొత్త షరతు.. విజయ్ హజారే ట్రోఫీలో కనిపిస్తారా?
2027 వరల్డ్‌కప్ దృష్ట్యా వన్డే టీమ్‌లో కొనసాగాలంటే సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ ఏడాది డిసెంబరులో జరిగే విజయ్ హజారే ట్రోఫీ లో తప్పనిసరిగా ఆడాలని సూచించినట్టు సమాచారం.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కి ఎంపిక కావాలంటే వీరిని గత సీజన్ రంజీ ట్రోఫీ ఆడమని కూడా బీసీసీఐ సూచనలు చేసింది. అయితే, ఆ సమయంలో సరైన ప్రదర్శన లేకపోవడంతో టెస్ట్ కెరీర్ ముగిసింది.
బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ 2027 వరల్డ్‌కప్ కోసం యంగ్ క్రికెటర్లతో బలమైన పూల్ సిద్ధం చేస్తోంది. విరాట్, రోహిత్ అనుభవం ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్లానింగ్‌లో వీరికి చోటు లేదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ జట్టు నుండి స్టార్ కల్చర్ తొలగించాలనుకుంటున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
55
రోహిత్, విరాట్ కెరీర్ ముగిసినట్టేనా?
ప్రస్తుతం రిపోర్టుల ప్రకారం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెరీర్ పై ప్రశ్నలు వస్తున్నాయి. విరాట్ ఇప్పటివరకు 2011, 2015, 2019, 2023 వరల్డ్‌కప్‌లలో ఆడగా, రోహిత్ 2015, 2019, 2023 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో ఉన్నారు.
2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన వెంటనే ఇద్దరూ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు, విజయ్ హజారే ట్రోఫీలో ఆడకపోతే, అక్టోబరులో ఆస్ట్రేలియా సిరీస్ వీరి చివరి వన్డే సిరీస్ కావొచ్చనే చర్చ మొదలైంది.