Mohammed Siraj - Zanai: మహమ్మద్ సిరాజ్- ఆశా భోంస్లే మనుమరాలు జనాయ్ మధ్య డేటింగ్ రూమర్స్ వస్తున్న నేపధ్యంలో సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్ అయ్యింది. వారు అన్నదమ్ములే. ఈ వీడియోతో డేటింగ్ రూమర్స్ కు చెక్ పడినట్టు అయింది.
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ తన కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రత్యార్థి బ్యాట్స్ మెన్స్ కు తన ఫేస్ బౌలింగ్ తో చుక్కలు చూపిస్తారు. ప్రతి గేమ్ లో తన మార్క్ ను చూపిస్తారు. మైదానంలో తన ప్రదర్శనతోనే కాకుండా, మైదానం బయట తన వ్యక్తిగత విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవల సోషల్ మీడియాలో మహమ్మద్ సిరాజ్, జనాయ్ భోంస్లే మధ్య డేటింగ్ రూమర్లు హల్చల్ సృష్టించగా, తాజాగా సిరాజ్ ఒక వీడియోతో ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఇంతకీ ఆ వీడియో ఏంటీ ?
24
సిరాజ్ వైరల్
గత కొంతకాలంగా సిరాజ్, ఆశా భోంస్లే మనుమరాలు జనాయ్ లపై డేటింగ్ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ వదంతులకు తెరపడింది. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా వారి బంధం బయటపడింది. వారి మధ్య అన్నచెల్లెలి బంధమే ఉన్నట్లు స్పష్టమైంది. రాఖీ పండుగ వేళ క్రికెటర్ సిరాజ్‌కు జనాయ్ రాఖీ కట్టారు. ఈ హృదయపూర్వక క్షణాన్ని సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టుకు నెటిజన్లు హృదయంతో స్పందించగా, సహచర క్రికెటర్ రిషబ్ పంత్ లవ్ ఎమోజీతో శుభాకాంక్షలు తెలిపారు.
34
ఇంగ్లాండ్ లో దూకుడు
ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. తన అద్భుతమైన ఫేస్ బౌలింగ్ తో మైదానంలో దూసుకెళ్లాడు. మొత్తం 23 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తన సత్తా చాటుకున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు టెస్టులకే పరిమితమైన నేపథ్యంలో, సిరాజ్ భారత బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. తన బౌలింగ్ తో భారత్ విజయం కోసం దూకుడు చూపుతూ, సిరీస్‌ను 2-2తో డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ నిలకడైన ప్రదర్శన వల్ల టీమిండియా విజయం సాధించింది. ఈ ప్రదర్శన అతడ్ని భారత బౌలింగ్ యూనిట్‌లో టాప్ ఫ్లేస్ లో నిలబెట్టింది.
ఇంగ్లండ్ పర్యటనలో ఇరగదీసిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రశంసల జల్లులో తడిసి మురిసిపోతున్నాడు. ఓవల్ టెస్టుతో మహ్మద్ సిరాజ్ టాక్ ఆఫ్ ది క్రికెట్ అయ్యాడు. మాజీ పేసర్లు, దిగ్గజ ప్లేయర్లు ఎవరి నోట విన్నా సిరాజ్ చాలా గొప్ప బౌలర్ అనే మాటలే వినిపిస్తున్నాయి.
పాక్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రమ్(Wasim Akram) కూడా మహమ్మద్ సిరాజ్ ప్రదర్శనను ప్రశంసించారు.‘నేను క్రికెట్ మ్యాచ్‌లు అరుదుగా చూస్తాను. కానీ, ఓవల్ టెస్టులో ఐదోరోజు రెప్పవాల్చకుండా చూశా. సిరాజ్ ఆకలితో ఉన్న సింహంలా కనిపించాడు. జట్టును గెలిపించేందుకు అతడు గొప్ప ప్రదర్శన చేశాడు. సిరాజ్ కేవలం సపోర్ట్ బౌలర్ మాత్రమే కాకుండా, టీమ్ లీడర్‌గా కూడా ఎదిగాడని' పేర్కొన్నారు.