Andhra Premier League Season 4: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 4 విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా మొత్తం 25 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రవేశం ఉచితం కావడం విశేషం.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రముఖ నటుడు, టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై ట్రోఫీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), శ్రీభరత్, భారత మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ లు కూడా పాల్గొన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ డాన్స్ షో, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల లైవ్ మ్యూజిక్ షో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షోలు ఆకట్టుకున్నాయి.
DID YOU KNOW ?
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి మూడు సీజన్ల విజేతలు వీరే
2022లో కోస్తా రైడర్స్ మొదటి టైటిల్ గెలిచింది. 2023లో రాయలసీమ కింగ్స్ విజేతగా నిలిచింది. 2024లో వైజాగ్ వారియర్స్ ఉత్తరాంధ్ర లయన్స్‌ను 87 పరుగులతో ఓడించి ఏపీఎల్ టైటిల్ గెలిచింది.
25
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 లో తలపడనున్న 7 జట్లు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 లో మొత్తం 7 జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 25 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 21 లీగ్ మ్యాచులు, 4 ప్లే ఆఫ్స్‌లు ఉండబోతున్నాయి. ఈ టోర్నీలో విజయవాడ సన్ షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడనున్నాయి.
ఐపీఎల్ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఈ లీగ్ నిర్వహించడం ద్వారా యంగ్ క్రికెటర్లకు అంతర్జాతీయ ప్రాతినిధ్యం కోసం అవకాశం కల్పించాలన్నది ఏపీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
35
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 కు ఫ్రీ ఎంట్రీ
క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకు ఏసీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచితం ప్రవేశం ఉంటుంది. స్టేడియం గేట్ నంబర్ 15 నుంచి లోపలికి ప్రవేశం ఉంటుంది. స్టేడియంలోని మౌలిక వసతులను ఆధునీకరించిన నేపథ్యంలో, ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 బ్రాండ్ అంబాసిడర్ గా హీరో వెంకటేష్
ఈసారి ఏపీఎల్‌కు సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే వెంకీ ఉండటం లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. మ్యూజిక్, డ్యాన్స్, తారల సమాహారంతో ప్రారంభోత్సవం మెగా సినీ ఈవెంట్ ను తలపించింది.
55
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 విజేతకు రూ.35 లక్షలు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 విజేత జట్టుకు రూ. 35 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 20 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ఈ లీగ్‌ను చూడటానికి ఐపీఎల్ సెలెక్టర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో యంగ్ ప్లేయర్లకు క్రికెట్ కెరీర్‌లో ఎదగడానికి ఇదొక మంచి అవకాశంగా ఉంది.
డీఆర్ఎస్ వంటి ఆధునిక సాంకేతికతను కూడా ఈసారి లీగ్‌లో ప్రవేశపెట్టారు. అలాగే, మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు.