Viral Video: భారత క్రికెట్‌లో ఒకప్పుడు సంచలన బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థానేలోని నిదాన్ కేర్ సెంటర్‌లో ఉన్న కాంబ్లీ మాట్లాడిన వీడియో అభిమానులను కలవర పెడుతోంది.
ప్రణవ్ మహాజన్ అనే క్రికెట్ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందులో వినోద్ కాంబ్లీ థానేలోని నిదాన్ కేర్ సెంటర్‌లో ఉన్నట్లు కనిపించారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపారు. కేర్ సెంటర్‌లో తనను చూసుకుంటున్న విధానం, అక్కడ లభిస్తున్న సదుపాయాలపై కూడా కాంబ్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి వాతావరణం తనకు ఇంటికి దూరంగా ఉన్న భావన కలిగించడం లేదని, సిబ్బంది ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటున్నారని చెప్పారు.
24
ఆరోగ్య సమస్యలతో గతంలోనూ ఇబ్బందులు
వినోద్ కాంబ్లీకి గత కొన్నేళ్లుగా ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతకాలం క్రితం ఆయన సరిగ్గా నడవలేక ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఆయన పరిస్థితిపై ప్రభావం చూపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేర్ సెంటర్‌లో కాంబ్లీ కనిపించడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నారు.
34
సచిన్‌తో కలిసి చిన్ననాటి నుంచే సంచలనం
వినోద్ కాంబ్లీ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్‌తో ఆయన స్నేహం, చిన్ననాటి క్రికెట్ ప్రయాణం. ఇద్దరూ స్కూల్ స్థాయిలోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టించారు. ఆ తర్వాత కాంబ్లీ భారత జట్టులోకి అడుగుపెట్టి అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. తక్కువ సమయంలోనే భారీ స్కోర్లు సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రతిభ ఉన్న బ్యాటర్‌గా ఆయనకు అప్పట్లో క్రికెట్ వర్గాల్లో మంచి పేరు వచ్చింది.
A recent video of Vinod Kambli, perhaps from some care center.
He was a star inspiration for us in the early 90s. Some people even rated him better than the legendary Sachin Tendulkar at that time.
Seeing him today like this definitely makes me sad.
వినోద్ కాంబ్లీ భారత తరఫున 17 టెస్టులు ఆడి 1,084 పరుగులు సాధించారు. ఆయన బ్యాటింగ్ సగటు 54కు పైగా ఉండటం విశేషం. టెస్టు క్రికెట్‌లో నాలుగు శతకాలు కూడా నమోదు చేశారు. అంతేకాదు, అత్యంత వేగంగా 1,000 టెస్టు పరుగుల మైలురాయిని చేరిన భారత బ్యాటర్లలో కాంబ్లీ పేరు నిలిచింది. వన్డేల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 104 వన్డేలు ఆడి 2,477 పరుగులు చేశారు. ఒక దశలో కాంబ్లీ బ్యాటింగ్ శైలి భారత క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది.
మైదానంలో స్టార్‌గా వెలిగిన కాంబ్లీ..
కాంబ్లీ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ఆయన జీవితం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రస్తుతం కేర్ సెంటర్‌లో ఉంటూ ఆరోగ్యం మెరుగుపడుతోందని స్వయంగా చెప్పడంతో అభిమానుల్లో కొంత ఆశ కలిగింది. గతంలో మైదానంలో తన ఆటతో కోట్లాది మందిని ఆకట్టుకున్న కాంబ్లీ.. ఇప్పుడు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియో కూడా ఆయన క్రికెట్ ప్రతిభను గుర్తు చేస్తూ, ప్రస్తుతం ఆయనపై అభిమానులకు ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటుతోంది.