Team India: ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ను భారత్ సమం చేయడంలో బ్యాటర్లతో పాటు బౌలర్లు సిరాజ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ లు కీలక పాత్ర పోషించారు.
ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసి యంగ్ ఇండియా చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్ లో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ దుమ్మురేపారు. ఇక బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు రాణించడంతో వారి పేర్లు హైలైట్ అవుతున్నాయి.
సిరీస్ ను సమం చేయడంలో పెద్దగా వెలుగులోకి రాని ప్లేయర్లు కూడా ఉన్నారు. వీరుకూడా భారత జట్టు ప్రదర్శనలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేశారు. వారిలో ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు.
DID YOU KNOW ?
టెస్టులో సెంచరీ కొట్టిన తమిళనాడు స్పిన్నర్
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2025 లో ప్రసిద్ధ్ కృష్ణ 14, ఆకాశ్ దీప్ 13, వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు తీశారు. వాషింగ్టన్ నాలుగో టెస్టులో సెంచరీ కొట్టిన తొలి తమిళనాడు స్పిన్నర్.
25
అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టిన యంగ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ
మూడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు ప్రసిద్ధ్ కృష్ణ. అతను 14 వికెట్లు తీసి బుమ్రాతో సమానంగా నిలిచాడు. బుమ్రా లేని సమయంలో ప్రత్యర్థులను దెబ్బకొట్టడంలో ముందున్నాడు. భారత జట్టు మెరుగైన బౌలింగ్ ప్రదర్శనలో ప్రసిద్ధ్ పాత్ర అపూర్వమైనది.
ముఖ్యంగా ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్‌ను ఔట్ చేయడం, మ్యాచ్ మలుపు తిప్పిన సందర్భంగా చెప్పవచ్చు. రన్‌రేట్ కొంత అధికంగా ఉన్నా అతను సాధించిన వికెట్లు టీమిండియా బలంగా పోటీ ఇవ్వడంలో ఎంతో ఉపయోగపడ్డాయి.
35
బంతితో పాటు బ్యాట్‌తోనూ మెరిసిన మల్టీ టాలెంట్ ప్లేయర్ ఆకాశ్ దీప్
ఆకాశ్ దీప్ ఈ సిరీస్‌లో మూడు టెస్టులు ఆడాడు. 13 వికెట్లు తీసి తన బౌలింగ్ సామర్థ్యాన్ని నిరూపించాడు. కానీ ఆశ్చర్యకరంగా అయిదో టెస్ట్‌లో నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన అతడు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 66 పరుగులు (93 బంతుల్లో) చేసి భారత గెలుపుకి బేస్ వేసాడు. దీంతో పాటు సెంచరీకి దూసుకెళ్తున్న హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసి, మ్యాచును భారత్ వైపు తిప్పాడు.
నాలుగు టెస్టులు ఆడిన వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు తీసినప్పటికీ, అతని బ్యాటింగ్ ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా నిలిచింది. నాలుగో టెస్ట్‌లో ఇంగ్లాండ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ (101 నాటౌట్) చేసి మ్యాచ్‌ను డ్రాగా తీసుకెళ్లాడు.
జడేజాతో కలిసి స్థిరమైన ఇన్నింగ్స్ తో టీమిండియాకు సిరీస్ విజయం కోసం ఆశలు బతికించేలా చేశాడు.
55
ఇంగ్లాండ్ సిరీస్ లో భారత జట్టు ముగ్గురు మొనగాళ్లు
ఇంగ్లాండ్ బలమైన జట్టుగా నిలిచిన ఈ సిరీస్‌లో భారత్ తేలిపోవచ్చు అనే అపోహలను టీమిండియా యంగ్ ప్లేయర్ల జట్టు తొలగించింది. ప్రసిద్ధ్ బౌలింగ్, ఆకాశ్ దూకుడు, వాషింగ్టన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఇవన్నీ కలసి భారత్‌ను గెలిచే స్థాయికి తీసుకెళ్లాయి.
అంతగా పబ్లిసిటీ రాని ఈ ముగ్గురు ఆటగాళ్లు టీమిండియా గర్వించదగిన ముగ్గురు మొనగాళ్లుగా చెప్పవచ్చు. భారత్ క్రికెట్ భవిష్యత్తుకు ఆణిముత్యాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
భారత జట్టు ఇంగ్లాండ్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించింది. ఈ ముగ్గురు ఆటగాళ్ల అసాధారణ ప్రదర్శన లేకుండా అది సాధ్యపడేది కాదు. తక్కువ అవకాశాలు వచ్చినా వాటిని పూర్తిగా ఉపయోగించుకున్నారు.