Top 5 Wicket Takers: ఇండియా - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-5 బౌల‌ర్లు

Published : Aug 04, 2025, 11:58 PM ISTUpdated : Aug 05, 2025, 12:27 AM IST

Top 5 Wicket Takers: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ 23 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్-భారత్ టెస్టు సిరీస్ లో అదరగొట్టిన మిగతా బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు సాధించిన టాప్-5 బౌలర్లు

తాజాగా ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025 టెస్టు సిరీస్‌ ఆత్మవిశ్వాసాన్ని, పోరాటానికి మారుపేరు చూపించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలోనూ ఆటగాళ్లు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అద్భుత‌మైన బౌలింగ్ లో మ్యాచ్ ను మ‌లుపుతిప్పారు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదు బౌలర్ల జాబితాలో ముగ్గురు భారత బౌలర్లు స్థానం సంపాదించగా, ఇంగ్లండ్‌కు చెందిన ఇద్దరు బౌలర్లు కూడా ఇందులో ఉన్నారు.

DID YOU KNOW ?
టెస్ట్ క్రికెట్‌లో అనిల్‌ కుంబ్లే రికార్డు
టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌ అనిల్ కుంబ్లే. అతను 1990 నుండి 2008 వరకు 132 టెస్ట్ మ్యాచ్‌లను ఆడారు. ఈ సమయంలో 236 ఇన్నింగ్స్ లలో 619 వికెట్లు తీశారు. అందులో 35 సార్లు 5 వికెట్లు, 8 సార్లు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
26
1. మహ్మద్ సిరాజ్ (భారత్) – 23 వికెట్లు

భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఐదు టెస్టు మ్యాచ్‌లలో 23 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 32.43గా న‌మోదైంది. భార‌త్-ఇంగ్లాండ్ సిరీస్‌ 2025లో సిరాజ్ రెండు సార్లు ఐదు వికెట్లు తీసిన‌ ఘనతను అందుకున్నాడు. అలాగే, ఒకసారి నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి టీమ్ ఇండియాను ముందుకు నడిపించడంలో అతని పాత్ర ప్రధానంగా నిలిచింది. ఓవ‌ల్ మ్యాచ్ ను పూర్తిగా భార‌త్ చేతిలోకి తీసుకువ‌చ్చాడు.

36
2. జోష్ టంగ్ (ఇంగ్లాండ్) – 19 వికెట్లు

ఇంగ్లాండ్ యంగ్ పేసర్ జోష్ టంగ్, ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. కేవలం మూడు టెస్టులలో 19 వికెట్లు తీయ‌డం విశేషం. అత‌ను 29.05 బౌలింగ్ సగటును నమోదు చేశాడు. టంగ్ ఈ సిరీస్ లో ఒక‌సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. జోష్ టంగ్ తన బౌలింగ్ వేగంతో భారత టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టాడు.

46
3. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 17 వికెట్లు

ఇంగ్లాండ్ జ‌ట్టు టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు టెస్టులలో 17 వికెట్లు తీసి మూడవ స్థానాన్ని ఆక్రమించాడు. అతని బౌలింగ్ సగటు 25.23 కాగా, ఒక‌సారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న కూడా ఇచ్చాడు. స్టోక్స్ బ్యాట్‌తోనే కాదు బంతితోనూ కూడా ఇంపాక్ట్ చూపాడు. ముఖ్యమైన బ్రేక్‌త్రూ లభించిన సమయాల్లో అతని స్పెల్స్ కీలకంగా మారాయి.

56
4. జస్ప్రిత్ బుమ్రా (భారత్) – 14 వికెట్లు

ప్రపంచ నంబర్ 1 టెస్టు బౌలర్ అయిన భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా ఈ సిరీస్ లో కేవ‌లం మూడు మ్యాచ్ ల‌ను మాత్ర‌మే ఆడాడు. మూడు టెస్టులలో 14 వికెట్లు తీసి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. అతని బౌలింగ్ సగటు 26.00. ఈ సిరీస్‌లో అతను రెండు సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాడు. బుమ్రా మంచి లైన్-లెంగ్త్, రివర్స్ స్వింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను దెబ్బ‌కొట్టాడు.

66
5. ప్రసిద్ధ్ కృష్ణ (భారత్) – 14 వికెట్లు

భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడు టెస్టులలో 14 వికెట్లు తీసి ఐదవ స్థానంలో నిలిచాడు. అతని బౌలింగ్ సగటు 37.07 కాగా, ఇందులో రెండు నాలుగు వికెట్ల స్పెల్స్ ఉన్నాయి. ఇది అతని టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. బౌలింగ్‌లో అతని వేగం, కచ్చితమైన లైన్ లెంగ్త్ బ్యాటర్లను ఇబ్బందులు పెట్టాయి.

ఈ సిరీస్‌లో బౌలింగ్ విభాగంలో భారత పేసర్లు తమ ప్రభావాన్ని చూపించగా, ఇంగ్లండ్ బౌలర్లు తమ జట్టు తరఫున గట్టి పోరాటం చేశారు. ఐదు టెస్టులుగా సాగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా సూప‌ర్ ఇన్నింగ్స్ లు వ‌చ్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories