India: భారత జట్టుపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 వికెట్ కీపర్లు వీరే

Published : Jul 06, 2025, 05:19 PM IST

India: భారత జట్టుపై టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 వికెట్ కీపర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
క్రికెట్ చరిత్రలో గుర్తుపెట్టుకోదగిన ఐదు ఇన్నింగ్స్‌లు

Most Runs Against India: భారత జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో కొంత మంది వికెట్ కీపర్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. వారి జట్టుకు తిరుగులేని విజయాలు అందించారు. వారి మ్యాచ్ లను కోల్పోయిన పలువురు వికెట్ కీపర్లు క్రికెట్ చరిత్రలో నిలిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. టీమిండియా తో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 వికెట్ కీపర్ల ప్రదర్శనల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

26
1. ఆండీ ఫ్లవర్ – 232* పరుగులు (నాగ్‌పూర్, 2000)

2000లో జింబాబ్వే జట్టు భారతదేశ పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్ లోని రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆండీ ఫ్లవర్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు. నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 232 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో జింబాబ్వేను ఓడిపోయే స్థితి నుంచి కాపాడాడు.

ఆండీ ఫ్లవర్ 444 బంతుల్లో 30 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 232 పరుగుల అజేయ రికార్డు ఇన్నింగ్స్ ను ఆడాడు. అతని ఇన్నింగ్స్ తో భారత్ గెలిచే మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్లవర్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ భారత జట్టుపై వికెట్ కీపర్‌గా ఇప్పటివరకు నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.

36
2. జేమీ స్మిత్ – 184* పరుగులు (బర్మింగ్‌హామ్‌, 2025)

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఇంగ్లీష్ ప్లేయర్ జేమీ స్మిత్ భారత్ పై 184 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇంగ్లాండ్ 84/5 ఓవర్‌లలో ఉన్న సందర్భంలో క్రీజులోకి వచ్చిన స్మిత్.. అద్బుతమైన ఆటతో 207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్సర్లతో అదరగొట్టాడు.

ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను ఆండీ ఫ్లవర్ 183* పరుగుల రికార్డును అధిగమించి భారతదేశంపై రెండవ అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. జేమీ స్మిత్ నాక్ తో  ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసింది.

46
3. ఆండీ ఫ్లవర్ – 183* (ఢిల్లీ, 2000)

ఆండీ ఫ్లవర్ మరోసారి జాబితాలో స్థానం సంపాదించాడు. 2000లో ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున తొలి ఇనింగ్స్‌లో 183* పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు.

351 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆండీ ఫ్లవర్ కొట్టిన 183 పరుగులతో ఈ ఇన్నింగ్స్ ను జింబాబ్వే 422/9 వద్ద డిక్లేర్ చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడి జింబాబ్వేను ఓడించారు. కానీ, భారత జట్టు బలమైన బౌలింగ్ కు వ్యతిరేకంగా ఆండీ ఫ్లవర్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయే నాక్ గా మిగిలింది.

56
4. ఇయాన్ స్మిత్ – 173 (ఆక్లాండ్, 1990)

న్యూజిలాండ్‌కు చెందిన వికెట్ కీపర్ ఇయాన్ స్మిత్ 1990లో ఆక్లాండ్‌లో భారత్‌తో జరిగిన టెస్ట్‌లో 173 పరుగులు నాక్ ఆడాడు. 85/6 వద్ద క్రీజులోకి వచ్చిన స్మిత్.. 136 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్సర్లతో 127.20 స్ట్రైక్ రేట్‌తో ధనాధరన్ ఇన్నింగ్స్ ను ఆడాడు.

న్యూజిలాండ్ జట్టు 391 పరుగులు చేయడంలో ఈ ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించింది. ఇది వికెట్ కీపర్‌గా అత్యంత దూకుడుగా ఆడిన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

66
5. దినేష్ చండిమాల్ – 162 (కాలే, 2015)

శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దినేష్ చండిమాల్ 2015లో కాలేలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పై 162 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన చండిమాల్.. 169 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 స్ట్రైక్ రేట్‌తో తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు.

అతని ఇన్నింగ్స్ కారణంగా శ్రీలంక 63 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. శ్రీలంక విజయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన దినేష్ చండిమాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

ఈ ఐదు వికెట్ కీపర్ల ప్రదర్శనలు టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టును ఎదుర్కొంటున్న సమయంలో ఎంతగానో ప్రభావం చూపాయి. వీరి ఇన్నింగ్స్‌లు కేవలం వ్యక్తిగత ఘనతలే కాకుండా, మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ప్రభావాన్ని చూపాయి. భారత జట్టు బౌలింగ్‌ను ఎదుర్కొన్న అత్యుత్తమ వికెట్ కీపర్ ఇన్నింగ్స్‌లుగా ఇవి చరిత్రలో నిలిచిపోయాయి.

Read more Photos on
click me!

Recommended Stories