రెండో ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు హాఫ్ సెంచరీలతో రాణించారు. పంత్ 65 పరుగులు, రాహుల్ 55 పరుగులు, జడేజా అజేయంగా 69 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున జోష్ టంగ్, షోయబ్ బషీర్ తలో రెండు వికెట్లు తీశారు.
గిల్ అరుదైన రికార్డులు సాధించాడు. గిల్ ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) చేసిన తొమ్మిదవ ప్లేయర్ గా నిలిచాడు. భారత్ తరపున ఇదివరకు ఈ ఘనతను సునీల్ గవాస్కర్ మాత్రమే సాధించాడు (1971, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో).
టెస్ట్ కెప్టెన్‌గా తొలి రెండు టెస్టుల్లో మూడు సెంచరీలు చేసిన రెండవ భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తరువాత గిల్ నిలిచాడు.
టెస్ట్ కెప్టెన్సీ ప్రారంభ దశలో రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన అరుదైన ఆటగాళ్లలో గిల్ కూడా చేరాడు. ఇందులో విజయ్ హజారే, గవాస్కర్, గ్రెగ్ చాపెల్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.