Tilak Varma: పాక్‌పై గెలిచాక తిలక్‌ వర్మ నారా లోకేశ్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో వైరల్

Published : Sep 29, 2025, 03:48 PM IST

Tilak Varma special gift to Nara Lokesh: ఆసియా కప్‌ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ గెలవడంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలకపాత్ర పోషించాడు. గెలుపు తర్వాత తిలక్.. నారా లోకేశ్‌కు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

PREV
15
ఆసియా కప్‌లో భారత్ అద్భత ప్రయాణం

దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌ 2025 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 146 పరుగులకే కుప్పకూలగా, టీమిండియా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతమైన నాక్ ఆడి హీరోగా నిలిచాడు. భారత టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో అతను 53 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

25
తిలక్ వర్మపై ప్రముఖుల ప్రశంసలు

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ పై అద్భుతంగా ఆడిన తిలక్ వర్మ పై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

ఒత్తిడి సమయంలోనూ శాంతంగా ఆడి, టీమిండియాకు విజయాన్ని అందించినందుకు తిలక్ వర్మ పై ప్రశంసల జల్లు కురిసింది. ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులు గర్వపడేలా తిలక్ ఆట సాగింది. ఈ క్రమంలోనే తిలక్ వర్మ ఒక వీడియో వైరల్ గా మారింది.

35
నారా లోకేశ్‌కు తిలక్ వర్మ ప్రత్యేక బహుమతి

ఆసియా కప్ ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తిలక్ వర్మ ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ఒక బహుమతిని ఇచ్చారు. తన ఆటోగ్రాఫ్‌తో కూడిన టీమ్ క్యాప్‌ను లోకేశ్‌కు గిఫ్ట్ గా పంపారు. "లోకేశ్ అన్నా.. ఇది నీకోసమే, లాట్స్ ఆఫ్ లవ్" అంటూ రాసి ఆ క్యాప్‌పై సంతకం చేశాడు. ఈ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది.

45
తమ్ముడూ, నువ్వు ఛాంప్.. తిలక్ వర్మ పై నారా లోకేశ్ ప్రశంసలు

తిలక్ వర్మ ఇన్నింగ్స్ తో పాటు తనకు పంపిన గిఫ్ట్ పై నారా లోకేశ్ స్పందించారు. “తిలక్ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకం. నువ్వు స్వదేశానికి వచ్చిన తర్వాత నీ చేతుల మీదుగానే ఈ క్యాప్‌ను తీసుకుంటాను. నువ్వు నిజమైన ఛాంప్” అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా గతంలో దుబాయ్‌లో తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో దిగిన ఫోటోను గుర్తుచేసుకున్నారు.

55
తిలక్ వర్మ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తిలక్ వర్మ ఆటపై ప్రశంసలు కురిపించారు. “తిలక్ అద్భుతమైన ఆటగాడు, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. నిన్ను చూసి గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. అలాగే జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా “టీమిండియా కృషి, తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఈ విజయం సాధ్యమయ్యేలా చేశాయి. ఇది ప్రతి భారతీయుడికి పండుగ బహుమతి” అంటూ ట్వీట్ చేశారు.

మొత్తానికి, ఆసియా కప్‌ ఫైనల్‌లో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టింది. తాజా వీడియోతో సోషల్ మీడియాలో తిలక్, లోకేశ్ అనుబంధం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories