IND vs ENG: లార్డ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్టులో ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. తొలి సెషన్ లోనే భారత్ కు రెండు కీలక వికెట్లు అందించాడు.
లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ తర్వాత మాట్లాడుతూ.. “ ఉదయం వరకు ఏమి చేయాలో తెలియక కన్‌ఫ్యూజ్ అయిపోయాను. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంపిక చేసేవాడినే” అని అన్నాడు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగగా, భారత జట్టు బౌలింగ్‌తో మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చింది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జస్ప్రిత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
26
నితీశ్ రెడ్డి డబుల్ హిట్.. ఇంగ్లాండ్ ఓపెనర్లు అవుట్
నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో 14వ ఓవర్ ను నితీస్ కుమార్ రెడ్డి వేశాడు.
ఆ ఓవర్ లో మూడో బంతికి మొదట బెన్ డకెట్ (23 పరుగులు) కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. డౌన్ ది లెగ్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించి గ్లోవ్‌ను తాకిన బంతి పంత్ చేతిలోకి వెళ్లింది.
అదే ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ కూడా 18 పరుగుల వద్ద అవుటయ్యాడు. స్టంప్‌కు దగ్గరగా పిచ్ అయిన బాల్‌ను డిఫెన్స్ చేయగా, ఆఫ్సైడ్ ఎడ్జ్ తీసుకుని పంత్‌కు సులభమైన క్యాచ్ దొరికింది.
నాలుగు బంతుల్లో రెండు వికెట్లు పడిపోవడంతో ఇంగ్లాండ్ స్కోర్ 44/2కి పడిపోయింది. దీంతో తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ జట్టు ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది.
36
ఇంగ్లాండ్ ను నిలబెట్టే ప్రయత్నంలో పోప్, రూట్
ఇంగ్లాండ్ తొలి సెషన్ లోనే 44 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి స్టార్ ప్లేయర్ జోరూట్, ఓలీపోప్ లు వచ్చారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు ఇద్దరు జాగ్రత్తగా ఆడుతున్నారు.
ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రూట్ క్రమంగా దూకుడు పెంచాడు. సిరాజ్ బౌలింగ్ లో అద్భుతమైన కవర్ డ్రైవ్‌తో తన తొలి బౌండరీ సాధించాడు. ఆ తర్వాత ఓలీ పోప్ కూడా ఆటాకింగ్ మూడ్‌లోకి వచ్చాడు. నితీష్ ఓవర్‌లో ఒక కవర్ డ్రైవ్ బౌండరీ కొట్టాడు.
భారత బౌలర్లు ప్రారంభం నుంచే తమ దూకుడును చూపించారు. పిచ్‌పై ఆకాశ్ దీప్, బుమ్రా, సిరాజ్ బౌలింగ్ తో భారత్ వేగంగా స్పందించింది. పిచ్‌పై గడ్డి తక్కువగా ఉండడంతో తొలి సెషన్‌లో సీమర్లకు సహాయం లభించింది.
మొదటి 15 ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 38.4% ఫాల్స్ షాట్లు ఆడారు. ఇది 2006 నుండి ఇంగ్లాండ్‌లో జరిగిన 135 టెస్ట్ మ్యాచ్‌లలో ఐదవ అత్యధిక శాతం కావడం గమనార్హం.
56
లార్డ్స్ పిచ్ పరిస్థితులు, వాతావరణం ఎలా ఉంది?
ఆరంభంలో బౌలర్లకు పిచ్ అనుకూలంగా ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మ్యాచ్ రెండో సెషన్ నుంచి బ్యాటర్లకు సహకరించే అవకాశాలున్నాయి.
“ఈ పిచ్‌పై కొంత గడ్డి ఉన్నా, అది తగ్గించారు. బంతికి స్వింగ్, బౌన్స్ లభించే అవకాశం ఉంది. స్లోప్ కీలక పాత్ర పోషిస్తుంది” అని నాజర్ హుస్సేన్ పేర్కొన్నారు.
“స్లోప్, పిచ్ మాయిశ్చర్‌తో మొదటి సెషన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది” అని దీప్ దాస్‌గుప్తా పేర్కొన్నారు.
66
లార్డ్స్‌లో భారత్ రికార్డులు
ఇంగ్లాండ్, భారత్ మధ్య లార్డ్స్ వేదికగా ఇప్పటివరకు 19 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లాండ్ 12 విజయాలు సాధించగా, భారత్ మూడు విజయాలతో నిలిచింది. 2014, 2018, 2021 టూర్‌లలో భారత్ అద్భుత విజయాలు నమోదుచేసింది.
మొత్తంగా లార్డ్స్ లో భారత్ విజయాలు తక్కువగానే ఉన్నా.. ప్రస్తుతం భారత బౌలింగ్, బ్యాటింగ్ విభాగం మంచి ఫామ్ లో ఉంది. రెండో టెస్టు విజయం జట్టులో ఉత్సాహం నింపింది. అదే జోరును ఇక్కడ కూడా కొనసాగించాలని చూస్తోంది.