India vs England: లార్డ్స్‌లో టాస్ పడిన వెంటనే ఈ ప్లేయర్ కు షాక్ తగిలింది !

Published : Jul 10, 2025, 04:44 PM IST

India vs England 3rd Test: ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య గురువారం ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లు ప్లేయింగ్ ఎలెవన్ లో చోటుదక్కించుకున్నారు.

PREV
15
లార్డ్స్ లో భారత్ vs ఇంగ్లాండ్ బిగ్ ఫైట్

India vs England 3rd Test: లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బౌలింగ్ చేస్తోంది.

రెండో మ్యాచ్ కు విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్ లోకి తిరిగి వచ్చాడు. టాస్ సందర్భంగా భారత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ బుమ్రా రాకను స్పష్టం చేశారు. దీంతో ఎవరు టీమ్ నుంచి బయటకు వెళ్లారనే ప్రశ్న వచ్చింది. 

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చి 10 వికెట్లు పడగొట్టి జట్టులో తన స్థానం పై స్పష్టతను ఇచ్చాడు. దీంతో ప్లేయింగ్ 11 నుంచి ఎవరిని బయటకు పంపాలనే విషయంలో శుభ్‌మన్ గిల్ కు సవాలు ఎదురైంది.

25
టాస్ తర్వాత ఈ ఆటగాడి గుండె పగిలింది

బుమ్రా జట్టులోకి రావడంతో టాస్ వేసినప్పుడు శుభ్‌మన్ గిల్ ఎవరో ఒక ప్లేయర్ ను బయటకు పంపాలి. లీడ్స్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవిచూసింది. అద్భుతమైన పునరాగమనం చేసి బర్మింగ్‌హామ్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇప్పుడు లార్డ్స్‌లోనూ అదే జోరు కొనసాగించాలని టార్గెట్ పెట్టుకుంది. 

అందుకే మంచి ఫామ్ లో ఉన్న ఆకాశ్ దీప్ ను జట్టులో కొనసాగించారు. పెద్దగా ప్రభావం చూపని ప్రసిద్ధ్ కృష్ణను ప్లేయింగ్ 11 నుంచి బయటకు పంపారు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లను ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ 6 వికెట్లు పడగొట్టాడు. అయితే, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

35
భారత జట్టు బౌలింగ్.. ప్రసిద్ధ్ కృష్ణ ప్రదర్శనలు

లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు. అందులో మొదటి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 128 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో అతను మొదటి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు, బర్మింగ్‌హామ్‌లో బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్‌ను రంగంలోకి దించారు. అతను రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు.

45
ఆకాశ్ దీప్, బుమ్రాలు జట్టుతో ఉన్నారు

లార్డ్స్‌ టెస్టు కోసం ప్లేయింగ్ 11 నుంచి ప్రసిద్ కృష్ణను తొలగించారు. ఆకాష్ దీప్ ఇటీవలి ప్రదర్శన అతనికి చోటు కల్పించింది. చివరి టెస్ట్‌లో, సిరాజ్‌తో పాటు ఆకాష్ దీప్ గొప్ప ఫామ్‌ను ప్రదర్శించాడు. 

ఇప్పుడు బుమ్రా భారత జట్టుతో చేరడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ దాడి మరింత బలంగా మారింది. ప్రసిద్ కృష్ణను బెంచ్‌కు పరిమితం చేశారు.

55
ఇంగ్లాండ్ vs భారత్ మూడో టెస్టు ప్లేయింగ్ 11

భారత్:

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్:

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వైస్ ప్టెన్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్

Read more Photos on
click me!

Recommended Stories