టీమిండియా: ఆసియా కప్‌లో 5 అద్భుత రికార్డులు

Published : Sep 05, 2025, 06:37 PM IST

Asia Cup 2025: భారత జట్టు ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. ఈ టోర్నీలో టీమిండియా సాధించిన 5 అద్భుత రికార్డులు ఇప్పటికీ ఎవరు అధిగమించలేకపోయారు. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
ఆసియా కప్‌లో టీమిండియా ఆధిపత్యం

క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్లలో ఒకటైన ఆసియా కప్ 17వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీలో ఇప్పటివరకు ఎక్కువసార్లు ట్రోఫీని గెలిచిన జట్టు భారత్. 

ఆసియా కప్ లో 8 సార్లు భారత్ టైటిల్‌ను గెలుచుకుంది. రెండో స్థానంలో శ్రీలంక 6 సార్లు విజేతగా నిలిచింది. ఇక పాకిస్థాన్ 2 సార్లు మాత్రమే కప్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్, 9వసారి టైటిల్ సాధించడానికి సిద్ధంగా ఉంది.

DID YOU KNOW ?
ఆసియా కప్ లో భారత్
ఆసియా కప్ లో అత్యధిక టైటిల్స్ (8) గెలిచిన జట్టు భారత్. ఆ తర్వాత శ్రీలంక, పాకిస్తాన్ లు ఉన్నాయి. ఈ టోర్నీని ఇప్పటివరకు వన్డే, టీ20 ఫార్మాట్ జరిగింది.
26
ఆసియా కప్ లో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డు

ఆసియా కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు భారత్. అత్యధికంగా టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరిగాయి. మొత్తం 11 సార్లు ఫైనల్‌కు చేరిన భారత్, అందులో 8 సార్లు విజేతగా నిలిచింది. ఈ ఆధిపత్యం వల్లే క్రికెట్ ప్రపంచంలో భారత్ శక్తివంతమైన జట్టుగా గుర్తింపుపొందింది.

36
ఆసియా కప్ లో వరుసగా మూడు ట్రోఫీలు గెలిచిన టీమిండియా

ఆసియా కప్ లో వరుస టైటిల్స్ గెలిచిన జట్టుగా కూడా టీమిండియా రికార్డులు సాధించింది. భారత జట్టు ఆసియా కప్‌లో వరుసగా 3 సార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టు. 1988, 1990, 1995లో వరుసగా మూడు సార్లు ఈ ఘనత సాధించింది. 

శ్రీలంక 2004, 2008లో ఆ రికార్డును బద్దలు కొట్టే ప్రయత్నం చేసినా అందులో సక్సెస్ కాలేదు. ఆసియా కప్ లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు భారత్ రికార్డును అధిగమించలేకపోయింది.

46
అత్యధిక పరుగుల తేడాతో విక్టరీ రికార్డు భారత్ సొంతం

అసియా కప్ లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా కూడా భారత్ రికార్డు సాధించింది. 2008లో భారత్ హాంకాంగ్‌పై 256 పరుగుల తేడాతో గెలిచి ఆసియా కప్ చరిత్రలో అతి పెద్ద విజయం నమోదు చేసింది. 

ఈ రికార్డును ఇంతవరకు ఏ జట్టు కూడా బద్దలుకొట్టలేకపోయింది. ఆ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుతంగా రాణించింది.

56
అతి తక్కువ బంతుల్లో ఫైనల్ విజయాల రికార్డు సాధించిన భారత్

ఆసియా కప్ చరిత్రలో అత్యంత వేగంగా ఫైనల్ గెలిచిన రికార్డు కూడా భారత్ పేరిటే ఉంది. 2023లో జరిగిన ఫైనల్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. 

భారత జట్టు ఈ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 37 బంతుల్లో సాధించింది. ఇది టోర్నమెంట్ చరిత్రలో అతి వేగవంతమైన ఫైనల్ విజయం. అలాగే, తక్కువ స్కోర్ తో సాగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లలో ఒకటిగా నిలిచింది.

66
ఆసియా కప్‌లో అత్యధిక సిక్సులతో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ రికార్డు

భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడు. ఇప్పటివరకు ఆడిన 37 మ్యాచ్‌లలో మొత్తం 40 సిక్సులు కొట్టాడు. ఇందులో 28 సిక్సులు వన్డేల్లో, 12 సిక్సులు టీ20ల్లో వచ్చాయి. భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ సాధించిన ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు.

Read more Photos on
click me!

Recommended Stories