25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఫుల్ స్టాప్.. రిటైర్మైంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ బౌలర్

Published : Sep 04, 2025, 01:53 PM IST

Amit Mishra retirement: ఈ ఏడాది మరో టీమిండియా ప్లేయర్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌రికారు. త‌న అద్భుత బౌలింగ్‌తో టీమిండియా విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించిన ఆ ప్లేయ‌ర్ 25 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌యాణానికి ఫుల్ స్టాప్ పెట్టారు.  

PREV
15
అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు

భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడి అభిమానులను అలరించిన వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా రిటైర్మెంట్ ప్రకటించాడు. గురువారం మీడియా ముందు తన నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన, ఇకపై అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు తెలిపారు. 42 ఏళ్ల వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం తనకూ సులభం కాదని, కానీ గాయాలు, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే కోరిక కారణంగా వెనక్కి తగ్గానని మిశ్రా స్పష్టం చేశారు.

25
25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం

అమిత్ మిశ్రా కెరీర్‌ మొత్తం రెండు దశాబ్దాలకుపైగా కొనసాగింది. భారత్ తరపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడి, వరుసగా 76, 64, 16 వికెట్లు తీశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 152 మ్యాచ్‌ల్లో 535 వికెట్లు, దేశీయ టి20లు (ఐపీఎల్ సహా) 259 మ్యాచ్‌ల్లో 285 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లు, 174 వికెట్లు సాధించి, టోర్నీ చరిత్రలో ఏడో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ వేదికలో చివరిసారి 2017లో ఆడిన మిశ్రా, అప్పటి నుంచి దేశీయ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో కొనసాగాడు. 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్ అతని చివరిది.

35
అభిమానులకు కృతజ్ఞత

ఈ విష‌య‌మై అమిత్ మిశ్రా మాట్లాడుతూ.. “నా క్రికెట్‌ ప్రయాణం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది, ఎన్నో గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇచ్చింది. ఎక్కడ ఆడినా అభిమానుల ప్రేమ ఎల్లప్పుడూ నాకు తోడుగా నిలిచింది. బీసీసీఐ, హర్యానా క్రికెట్‌ సంఘం, కోచ్‌లు, సహచరులు, నా కుటుంబం అందరికీ కృతజ్ఞతలు” అంటూ మిశ్రా భావోద్వేగంతో మాట్లాడాడు.

45
రికార్డులు

మిశ్రా పేరు వినగానే ఐపీఎల్‌లోని ఒక అరుదైన రికార్డు గుర్తొస్తుంది. ఐపీఎల్‌లో మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ఆయనే. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున, 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున, 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున హ్యాట్రిక్ సాధించాడు. అలాగే 2013లో జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో 18 వికెట్లు తీసి, ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో భారత బౌలర్‌గా అత్యధిక వికెట్లు తీశాడు. 2008లో ఆస్ట్రేలియాపై టెస్ట్ డెబ్యూ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి అరుదైన క్లబ్‌లో చేరాడు.

55
తదుపరి ఇన్నింగ్స్ – కోచ్, కామెంటేటర్‌గా

క్రికెట్‌ను మైదానంలో వీడినప్పటికీ, అభిమానులతో సంబంధం కొనసాగించాలని మిశ్రా భావిస్తున్నాడు. భవిష్యత్తులో కోచ్‌గా, కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ఆరంభించాలని నిర్ణయించుకున్నాడు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా క్రికెట్ ప్రియులతో మమేకమవుతానని కూడా చెప్పాడు.

Read more Photos on
click me!

Recommended Stories