T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

Published : Oct 22, 2021, 03:51 PM ISTUpdated : Oct 22, 2021, 03:54 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది టీమిండియా. షెడ్యూల్ ప్రకారం పరిస్థితులన్నీ బాగుంటే, ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్, కరోనా కారణంగా యూఏఈలోకి వెళ్లిన విషయం తెలిసిందే...

PREV
110
T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా కారణంగా మధ్యలోనే బ్రేక్ పడడంతో మరో దారి లేక, యూఏఈ వేదికగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

210

రెండు సీజన్లుగా యూఏఈలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండడంతో ఈసారి భారత జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. వార్మప్ మ్యాచుల్లో మనోళ్ల ప్రదర్శన, ఆ అంచనాలను మరింత పెంచేశాయి...

310

టీ20 వరల్డ్‌ కప్ ప్రారంభానికి ముందే ఈ ఐసీసీ టోర్నీ తర్వాత టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కూడా చెప్పేశాడు...

410

ఈ గ్యాప్‌లోనే టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి మహేంద్ర సింగ్ ధోనీని మెంటర్‌గా నియమిస్తున్నట్టు నిర్ణయం ప్రకటించింది బీసీసీఐ. అయితే ఎమ్మెస్ ధోనీ నియామకం వెనకాల కోహ్లీ ఉన్నాడని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మౌంటీ పనేసర్...

510

‘ధోనీని మెంటర్‌గా తీసుకురావాలనేది పూర్తిగా విరాట్ కోహ్లీ నిర్ణయమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇది కెప్టెన్‌గా తన మొట్టమొదటి, ఆఖరి టీ20 వరల్డ్‌కప్ కావడంతో ఎమ్మెస్ ధోనీని మెంటర్‌గా కావాలని కోరుకుని ఉంటాడు...

610

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ ఆడి నేనెంతో నేర్చుకున్నా. అందుకే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో కూడా నాకు మంచి అనుభవం మిగలాయి. అందుకే టీ20 కెప్టెన్‌గా నా జర్నీని గొప్పగా ముగించాలని అనుకుంటున్నా...

710

అలా జరగాలంటే జట్టులో ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ నింపే పర్సనాలిటీ కావాలి. నాకు తెలిసి అది ఎమ్మెస్ ధోనీ... అని విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధికారులకు చెప్పి ఉండొచ్చు..

810

విరాట్ కోహ్లీ గత మూడు, నాలుగేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాడు. కోహ్లీ జట్టులో ఎమ్మెస్ ధోనీ ఉన్నప్పుడు కూడా ఐసీసీ టైటిల్ రాలేదు. అయితే ధోనీ, మెంటర్‌గా పనిచేయడానికి డబ్బులేమీ అడగలేదు...

910

ఇలా ఎన్నో విషయాలు, మహేంద్ర సింగ్ ధోనీని మెంటర్‌గా నియమించడానికి కారణమై ఉంటాయి.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోనీ ఉంటే, ఆటగాళ్లకు అంతకుమించిన ధైర్యం, బలం ఇంకేముంటుంది...

1010

విరాట్ కోహ్లీకి ఎమ్మెస్ ధోనీ అంటే చాలా గౌరవం ఉంది. ధోనీకి పెద్ద పెద్ద మ్యాచులను ఎలా గెలవాలో బాగా తెలుసు. ధోనీ బుర్రలోని ఆ ఐడియాలను వాడుకుని వరల్డ్ కప్ గెలవాలనేది కోహ్లీ ఆలోచన...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మౌంటీ పనేసర్...

 

ఇవీ చదవండి: ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

click me!

Recommended Stories